English | Telugu

భార్యకు విడాకులు ఇవ్వకుండానే సమంతతో దర్శకుడి ప్రేమాయణం!

నాగ చైతన్య, సమంత (Samantha) విడిపోయి మూడేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ వీళ్ళ గురించి ఏవో ఒక వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఇటీవల చైతన్య, శోభితా ధూళిపాళ నిశ్చితార్థం జరగడంతో.. చై-సామ్ మరోసారి ప్రముఖంగా వార్తల్లో నిలిచారు. చైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నాడు.. మరి సమంత కూడా అదే బాటలో పయనిస్తుందా అనే చర్చలు మొదలయ్యాయి. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ.. త్వరలోనే సమంత మళ్ళీ పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఒక ప్రముఖ దర్శకుడితో సమంత ప్రేమలో ఉన్నట్లు న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. 'ఫ్యామిలీమ్యాన్‌' వెబ్ సిరీస్ దర్శక ద్వయం(రాజ్-డీకే)లో ఒకరైన రాజ్ నిడిమోరు. 'ఫ్యామిలీమ్యాన్‌' సీజన్-2 లో సమంత నటించింది. అయితే అందులో నటిగా సమంతకి ఎంత పేరు వచ్చిందో, ఆమె నటించిన బోల్డ్ సీన్స్ పై అక్కినేని అభిమానుల నుంచి అంతే అసహనం వ్యక్తమైంది. ఓ రకంగా ఆ సిరీసే చై-సామ్ మధ్య మనస్పర్థలకు బీజం వేసిందని అప్పట్లో ప్రచారం జరిగింది. మరి అందులో వాస్తవం ఎంతో తెలీదు కానీ.. ఇప్పుడదే వెబ్ సిరీస్ సామ్-రాజ్ లను దగ్గర చేసిందని అంటున్నారు.

'ఫ్యామిలీమ్యాన్‌-2' సిరీస్ సమయంలో సామ్-రాజ్ మధ్య స్నేహం చిగురించిందని, ఇప్పుడా స్నేహం ప్రేమగా మారిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ప్రస్తుతం రాజ్-డీకే దర్శకత్వంలో రూపొందుతోన్న 'సిటాడెల్'లో కూడా సమంత నటిస్తోంది. ఈ సిరీస్ చిత్రీకరణ సమయంలోనే సామ్-రాజ్ మరింత దగ్గరయ్యారని, పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. రాజ్ కి ఇప్పటికే వివాహమైంది. కానీ భార్యకు విడాకులు ఇవ్వకుండానే సమంతతో పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయాడట. ఇక ఇప్పుడు సమంత నుంచి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. తన భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. వీలైనంత త్వరగా భార్యకు విడాకులిచ్చి, సమంతతో ఏడడుగులు నడవాలని ఆశ పడుతున్నాడట. మరి బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.