English | Telugu

సమంత కాపీక్యాట్!


సమంత అదిరిపోయే ఫ్యాషన్‌తో కూడిన డ్రస్‌లు వేసుకుంటుందన్న అభినందనలు టాలీవుడ్‌లో వినిపిస్తున్న తరుణంలో సమంత ఫ్యాషన్ మొత్తం కాపీ ఫ్యాషన్ అని ఓ ఆంగ్ల దినపత్రిక అసలు గుట్టు విప్పింది. దీపికా పడుకోన్, సోనమ్ కపూర్ వాడేసి వదిలేసిన ఫ్యాషన్లను సమంత కాపీ కొడుతూ అదేదో తానే ఫస్ట్ టైమ్ ఇంట్రడ్యూస్ చేసిన ఫ్యాషన్ అన్నట్టు పోజులు కొడుతోందని సదరు ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనంపై సమంత ఫైరైంది. తన ట్విట్టర్ అకౌంట్లో తెల్లవారుఝామునే తన ఆగ్రహం మొత్తాన్ని వెళ్లగక్కింది. ఫ్యాషన్‌ రంగానికి సంబంధించిన తనకున్న పరిజ్ఞానాన్ని తన ట్విట్లలో వెళ్ళగక్కింది. టైమ్ పత్రికలో పనిచేసేవాళ్ళకి అసలు ఫ్యాషన్ గురించే తెలియదన్నట్టుగా ట్విట్లు పోస్టు చేసింది. ఇలా సదరు ఆంగ్ల దినపత్రిక కథనం మీద విమర్శలు గుప్పిస్తూ ఏకంగా పది ట్వీట్లు ఇచ్చేసి ఆఖరికి మాత్రం పొద్దున్నే తన ట్వీట్లతో విసిగించినందుకు సారీ అంటూ తన ఫాలోయర్లకు క్షమాపణలు చెప్పింది. పనిలోపనిగా తనకు పబ్లిసిటీ ఇచ్చిన ఆ ఆంగ్ల దినపత్రికకి థాంక్స్ కూడా చెప్పింది.