Read more!

English | Telugu

మధుబాలకి అంత సీన్ వుందా?

 

‘రోజా’ సినిమా ద్వారా సినిమా రంగంలో లైమ్‌లైట్‌లోకి వచ్చిన హీరోయిన్ మధుబాల ఆ తర్వాత దాదాపు ఓ అరడజను హిట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఆమెకి అదృష్టం ముఖం చాటేయడంతో సినిమా రంగానికి దూరమై చక్కగా పెళ్ళి చేసుకుని సంసార బాధ్యతలలో మునిగిపోయింది. ఈమధ్యకాలంలో మళ్ళీ సినిమా రంగం మీద మోజు పుట్టుకొచ్చి మళ్ళీ ఇండస్ట్రీలోకి ఎంటరైంది. అమ్మ, అక్క లాంటి పాత్రల్లో కనిపించింది. అయితే మధుబాలలో అంతకు ముందు వున్నంత గ్లామర్ ఏ కోశానా లేకపోవడంతో ఆమెకు అక్క, అమ్మ పాత్రల్లో కూడా పెద్ద డిమాండ్ రాలేదు. ఇలాంటి సమయంలో తెలుగులో హిట్ అయిన ‘అత్తారింటికి దారేది’ సినిమా కన్నడ రీమేక్‌లో నటించే అవకాశం మధుబాలకి వచ్చింది. ఆ సినిమాలో ‘ఈగ’ ఫేమ్ సుదీప్ హీరో. తెలుగులో నదియా ధరించిన అత్త పాత్రని కన్నడలో మధుబాల ధరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వయసు పెరిగిన గ్లామర్ ఎంతమాత్రం తగ్గని నదియాతో, ప్రస్తుతం సన్నగా ముసలమ్మలా వున్న మధుబాలని పోల్చి చూసుకుని సినిమా వర్గాలు పెదవి విరుస్తున్నాయి. నదియాలోని దర్పం, గ్లామర్, బిల్డప్ మధుబాలలో ఏ కోశానా లేవని అంటున్నాయి.