English | Telugu
అఖిల్ కి ఈ సారైనా ప్లస్సవుతుందా!?
Updated : Feb 23, 2022
`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`తో కథానాయకుడిగా తొలి విజయాన్ని అందుకున్నాడు అక్కినేని బుల్లోడు అఖిల్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. `ఏజెంట్` పేరుతో రూపొందుతున్న ఈ స్పై థ్రిల్లర్ కి వక్కంతం వంశీ కథను అందించగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి రానుందని సమాచారం.
Also Read:సంక్రాంతి టార్గెట్ గా బాలయ్య సినిమా!?
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో అక్కినేని అఖిల్ కి జోడీగా సాక్షి వైద్య నటిస్తోంది. సాక్షికి ఇదే తొలి తెలుగు సినిమా. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలోనూ అఖిల్ డెబ్యూ హీరోయిన్స్ తో రొమాన్స్ చేశాడు. తన తొలి చిత్రం `అఖిల్`తో సయేషా సైగల్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా.. రెండో సినిమా `హలో`తో కళ్యాణి ప్రియదర్శన్ కూడా తెలుగునాట నాయికగా తొలి అడుగేసింది. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ అఖిల్ కి పరాజయాలే ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో.. మరో డెబ్యూ తార సాక్షి వైద్య కాంబినేషన్ అఖిల్ కి ఏ మేరకు ప్లస్సవుతుందో చూడాలి మరి.