English | Telugu

తార‌క్ తో దిశ చిందులు!?

యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్`.. వేస‌వి కానుక‌గా మార్చి 25న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో.. త‌న త‌దుప‌రి సినిమాని ప‌ట్టాలెక్కించే దిశ‌గా అడుగులు వేస్తున్నారు తార‌క్. `ఎన్టీఆర్ 30` అనే వ‌ర్కింగ్ టైటిల్ తో రూపొంద‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని విజ‌న‌రీ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించ‌నున్నారు. `జ‌న‌తా గ్యారేజ్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్ లో రాబోతున్న సినిమా కావ‌డంతో.. ఈ మూవీపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Also Read:కీర్తి, త‌మ‌న్నా, రాశీ ఖ‌న్నా.. సేమ్ రూట్!

ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో తార‌క్ కి జంట‌గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టించ‌బోతోంది. కాగా, క‌థానుసారం ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్ కి కూడా స్థాన‌ముంద‌ట‌. అందులో `లోఫ‌ర్` భామ దిశా ప‌టాని చిందులేసే అవ‌కాశ‌ముంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. మ‌రి.. `జ‌న‌తా గ్యారేజ్`లోని కాజ‌ల్ అగ‌ర్వాల్ చేసిన స్పెష‌ల్ డాన్స్ నంబ‌ర్ ``ప‌క్కా లోక‌ల్`` త‌ర‌హాలో ఈ ఐట‌మ్ సాంగ్ కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.

Also Read:'క‌ళావ‌తి' సాంగ్‌కు సితార స్టెప్పులు!

కాగా, `ఎన్టీఆర్ 30`ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. 2023 సంక్రాంతికి ఈ పాన్ - ఇండియా మూవీ జ‌నం ముందుకు రావ‌చ్చంటున్నారు.