
నటసింహం నందమూరి బాలకృష్ణకి సంక్రాంతి సీజన్ భలేగా అచ్చొచ్చింది. గతంలో ఈ సీజన్ లో పలు విజయాలు చూశారు బాలయ్య. అంతేకాదు.. `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు` వంటి ఇండస్ట్రీ హిట్స్ కూడా సంక్రాంతి సీజన్ లోనే సొంతం చేసుకున్నారు ఈ నందమూరి హ్యాండ్సమ్ హీరో. కట్ చేస్తే.. మరోసారి ముగ్గుల పండక్కి మురిపించే దిశగా బాలయ్య అడుగులు వేస్తున్నారని బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2023 సంక్రాంతి టార్గెట్ గా నిర్మాణం జరుపుకోనుందట. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, ప్రస్తుతం `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ సందడి చేయనుంది. ఇక అనిల్ రావిపూడి విషయానికి వస్తే.. అతని తాజా చిత్రం `ఎఫ్ 3` వేసవి కానుకగా మే 27న థియేటర్స్ లోకి రాబోతోంది. ఇందులో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించారు.






