English | Telugu
రామ్ సినిమాలో చోప్రా భామ!?
Updated : Feb 22, 2022
మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఓ యాక్షన్ డ్రామా చేయబోతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస చిట్టూరి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ చిత్రం.. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.
Also read :'భీమ్లా నాయక్' ఎఫెక్ట్.. 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' వాయిదా
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు స్థానముందట. వారిలో ఒకరిగా `లైగర్` భామ అనన్యా పాండే నటించబోతుందంటూ ఒకవైపు ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో మెయిన్ లీడ్ గానూ బాలీవుడ్ ముద్దుగుమ్మ నటించబోతోందట. ఆ భామ మరెవరో కాదు.. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సిస్టర్ పరిణీతి చోప్రా. `ఇష్క్ జాదే`, `శుద్ధ్ దేశీ రొమాన్స్`, `హసీ తో ఫసీ` వంటి హిందీ చిత్రాలతో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ చోప్రా సుందరి. త్వరలోనే రామ్ - బోయపాటి శ్రీను కాంబో మూవీలో పరిణీతి చోప్రా ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
Also Read:ఆనాటి సంగతి: అప్పటి చిన్న శాస్త్రి ఇప్పటి కళాతపస్వి!
కాగా, రామ్ ప్రస్తుతం `ద వారియర్` అనే బైలింగ్వల్ మూవీలో నటిస్తున్నాడు. కోలీవుడ్ కెప్టెన్ లింగు స్వామి డైరెక్ట్ చేస్తున్న ఈ ద్విభాషా చిత్రంలో రామ్ కి జంటగా కృతి శెట్టి నటిస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్న ఈ సినిమాని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం తెరపైకి రానుంది.