English | Telugu
మొగుడు పిలిస్తే రానంటున్న పెళ్ళాం
Updated : Jun 25, 2013
వరుస ఫ్లాప్ లతో విసిగిపోయిన తాప్సీకి టాలీవుడ్ కి రావడమే నచ్చట్లేదంట. "మొగుడు", "గుండెల్లో గోదారి", "షాడో" వంటి చిత్రాలు వరుస అట్టర్ ఫ్లాప్ అవడంతో తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటేనే నచ్చట్లేదంట.
"మొగుడు" చిత్రంలో భార్యాభర్తలుగా నటించి మంచి మార్కులే సంపాదించినా... సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే తాజాగా మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి నటించిన చిత్రం "సాహసం". యాక్షన్, అడ్వెంచర్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రమోషన్ కోసం హైదరాబాద్ కు రమ్మని గోపీచంద్ పిలిస్తే... రానని చెప్పేసిందట. దాంతో అసలే వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న గోపీచంద్ కు, తాప్సీ టార్చర్ మరింత ఎక్కువ అయ్యింది. ఎలాగైనా ఈ సినిమాతో హిట్టు కొట్టాలి అనుకున్న గోపీచంద్... తాప్సీ రాకపోవడంతో ఆలోచనలో పడ్డాడంట.
దీంతో తాప్సీపై దర్శక, నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేయాలనీ ఈ చిత్ర నిర్మాతలు భావిస్తున్నారంట. మరి దీనికి తాప్సీ ఎలా స్పందిస్తుందో... గోపీచంద్ ఏ విధంగా ఈ చిత్రాన్నీ ప్రమోట్ చేస్తాడో చూడాలి.