English | Telugu

చరణ్-అర్జున్ పోటాపోటీ !!

 

డైరెక్టర్స్‌కి కర్చీఫ్‌లు వేయడంలో రామ్‌చరణ్, అల్లు అర్జున్ ఒకరితో ఒకరు పోటీ పడుతూ.. ఇతర హీరోలకు అయోమయానికి గురి చేస్తున్నారు.

 

ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో "రేసు గుర్రం" చేస్తున్న అల్లు అర్జున్.. ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యీ మొదలవ్వగానే, హరీష్‌శంకర్ ప్రోజెక్ట్ కన్‌ఫర్మ్ చేసుకున్నాడు. పనిలో పనిగా గోపిచంద్ మలినేనికి ఓకె చెప్పేసాడు. అలాగే.. "గుండెజారి గల్లంతయ్యిందే" చిత్ర దర్శకుడు విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలోనూ నటించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మూడు కాకుండా.. మారుతి దర్శకత్వంలోనూ నటించేందుకు అల్లు అర్జున్ ఆసక్తి చూపుతున్నాడు.

 

మరోవైపు రామ్‌చరణ్ కూడా ఫామ్‌లో ఉన్న డైరెక్టర్స్‌ ఎవర్నీ వదలడం లేదు. ప్రస్తుతం "ఎవడు", "తుఫాన్" చిత్రాల్లో నటిస్తున్న రామ్‌చరణ్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. తాజాగా సురేంద్రరెడ్డి సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్‌చరణ్.. త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ విధంగా ఒకరితో ఒకరు పోటీపడుతూ.. డైరెక్టర్స్‌ను అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్న చరణ్, అర్జున్‌లు మిగతా హీరోలను కలవరపెడుతున్నారు!