English | Telugu

పుష్ప - ది రూల్ లో ప‌క్షి రాజు!?

హిందీనాట 125కి పైగా సినిమాల్లో సంద‌డి చేసిన వైనం.. అగ్ర క‌థానాయ‌కుడు అక్ష‌య్ కుమార్ సొంతం. ఆ మ‌ధ్య సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ '2.0'తో ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌ను నేరుగా ప‌ల‌క‌రించారాయ‌న‌. అందులో ప‌క్షిరాజు పాత్ర‌లో త‌న‌దైన ముద్ర వేశారు. క‌ట్ చేస్తే.. త్వ‌ర‌లో మ‌రో స‌ద‌ర‌న్ మూవీలో ఎంట‌ర్టైన్ చేయ‌నున్నార‌ట అక్ష‌య్. అది కూడా.. ఓ తెలుగు చిత్రంలో.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ జీనియ‌స్ సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన పాన్ - ఇండియా సెన్సేష‌న్ 'పుష్ప - ది రైజ్'కి రెండో భాగంగా 'పుష్ప - ది రూల్' త‌యారవుతున్న సంగ‌తి తెలిసిందే. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్న నాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో ఫహ‌ద్ ఫాజిల్ విల‌న్ గా కొన‌సాగ‌నున్నారు. కాగా, ఈ చిత్రంలో ఓ గెస్ట్ రోల్ కోసం అక్ష‌య్ తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని బ‌జ్. చిన్న పాత్రైనప్ప‌టికీ.. ఎంతో ప్ర‌త్యేకంగా ఇది ఉంటుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే 'పుష్ప - ది రూల్'లో అక్ష‌య్ కుమార్ ఎంట్రీపై క్లారిటీ రానుంది. మ‌రి.. ప‌క్షి రాజుగా ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న అక్ష‌య్.. ఈ స్పెష‌ల్ రోల్ లోనూ త‌న‌దైన ముద్ర వేస్తారేమో చూడాలి.