English | Telugu

రవితేజ "దరువు" మార్చ్ 15 న విడుదల

రవితేజ "దరువు" మార్చ్ 15 న విడుదల కానుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మాస్ మహరాజా రవితేజ హీరోగా, సొట్టబుగ్గల ముంబయ్ సుందరి తాప్సీ హీరోయిన్ గా, "శౌర్యం" శివ దర్శకత్వంలో, బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం "దరువు". ఈ టైటిల్ కి "సౌండ్ ఆఫ్ మాస్" అన్న క్యాప్షన్ నిర్ణయించారు.ఈ "దరువు" చిత్రం షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్ లో శరవేగంగా జరుగుతూంది. ఈ చిత్రం ఆడియో ఫిబ్రవరి నెలాఖరుకి విడుదల చేస్తారని సమాచారం.

ఈ"దరువు" చిత్రాన్ని మార్చ్ 15 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటానికి ఈ చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ అనీ, రవితేజ ఇమేజ్ కి సరిపోయే టిపికల్ కైండ్ ఆఫ్ రవితేజ మూవీ అని తెలిసింది.