English | Telugu

ఫ్లైట్లో రణబీర్, కత్రినాల చాటు ప్రేమ

ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ అయిన ప్రముఖ హీరో రణబీర్ కపూర్, ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ ల ప్రేమాయణం మళ్ళీ మొదలయ్యిందని బాలీవుడ్ జనం గోలపెడుతున్నారు. విషయానికొస్తే గతంలో రణబీర్‍ కపూర్, కత్రినా కైఫ్ ల మధ్య ప్రేమాయణం జరిగిందని బాలీవుడ్ సినీ పరిశ్రమ గగ్గోలుపెట్టింది.ఈ విషయాన్ని అటు రణబీర్ కపూర్ కానీ, ఇటు కత్రినా కైఫ్ కానీ ఎప్పుడూ అంగీకరించలేదూ...అలాగని ఖండించనూ లేదు. అయితే ఈ మధ్య వీళ్ళిద్దరూ ఆంస్టర్ డామ్ నుండి ఫ్రాంక్ ఫర్ట్ టు ముంబై విమానంలో భారత్ కు తిరిగి వస్తూండగా ఫ్లైట్ లో రహస్యంగా ఒక డజనుకి పైగా ముద్దులతో తమ ప్రేమాయాణాన్ని కొనసాగించారట. ఇందుకే ఎంత జాగ్రత్తగా కొనసాగించినా రంకు, బొంకు దాగవంటారు పెద్దలు.