English | Telugu
‘పీకే’ 2 కూడా వచ్చేస్తున్నాడా!!
Updated : Dec 20, 2014
అమీర్‌ఖాన్ హీరోగా రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ‘పీకే’ సినిమా సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. తొలిరోజు వచ్చిన సూపర్ టాక్ కారణంగా, రికార్డులు బద్ధలవడం ఖాయం. రికార్డుల సంగతి అటుంచితే, ఈ సినిమాకి స్వీకెల్ గా ‘పీకే’ 2 రాబోతుందట . ఈ సినిమాలో అమీర్‌ఖాన్ స్థానంలో రణబీర్ కపూర్ నటిస్తాడని అంటున్నారు. పీకే క్లైమాక్స్ లో అమీర్‌ఖాన్, రణబీర్ కపూర్ నీ రెండో గ్రహాంతరవాసిగా భూమిపైకి తీసుకురావడం చూస్తే ఈ వార్త నిజమేనని అనిపిస్తోంది. రాజ్ కుమార్ హిరాణి ఇదివరకు మున్నాభాయ్ సీరిస్ లో రెండు సినిమాలు తీశాడు. మరి ‘పీకే’ 2 గా రణబీర్ కపూర్ ఎప్పుడూ వస్తాడోనని అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.