English | Telugu

మహేష్ దానికి ఒప్పుకోలేదు!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలంతా సిక్స్ ప్యాక్ బాడీలు చూపుతుంటే, సూపర్ స్టార్ మహేష్ మాత్రం దానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇదే విషయంపై మేముసైతం ప్రోగ్రామ్‌ ఇంటర్వ్యూ లో షర్ట్‌ తీయాల్సిన సీన్‌ వస్తే ఏం చేస్తారు? అని సమంతకు వేసిన ప్రశ్నకు, మహేష్ నో ఛాన్స్‌ అనే సమాధానం ఇచ్చాడు. లేటెస్ట్ గా కూడా అదే సీన్ రీపిట్ అయినట్టు సమాచారం. ప్రస్తుతం మహేష్‌బాబు ‘మిర్చి’ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో మహేష్‌బాబును మరింత స్టైలిష్‌గా చూపించేందుకు కొరటాల శివ ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారట. దీనిలో మహేష్ బాబు సిక్స్‌ ప్యాక్‌ తో కనిపిస్తే మంచి క్రేజ్ వస్తుందని కొరటాల శివ ఆలోచించాడట. ఈ విషయాన్ని మహేష్ తో చెప్పగా సిక్స్‌ ప్యాక్‌ చూపించాలనే ఆసక్తి తనకు లేదంటూ నిరాకరించడట. దాంతో మరోసారి మహేష్‌ ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది.