English | Telugu

రామ్ చరణ్ వార్నింగ్

మెగాస్టార్ ఏకైక కుమారుడు, ఆయన నటవారసుడు అయిన యువ హీరో రామ్ చరణ్ తేజ ఈ మధ్య వార్నింగ్ ఇచ్చాడట. ఎవరికి వార్నింగిచ్చాడూ, ఎందుకిచ్చాడూ అన్నది మీ కోసం.విషయంలోకి వెళ్తే తన గత చిత్రం "ఆరేంజ్‍' చిత్రానికి దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ పుణ్యమాని అవసరానికి మించి మితిమీరిన బడ్జెట్ ఖర్చు చేసి బాబాయ్ నాగబాబుని ముంచటం జరిగింది.దాంతో వెంటనే జరిగిన తప్పుని తెలుసుకున్న ఈ యువహీరో ప్రస్తుతం తను హీరోగా నటిస్తున్న మెగాసూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, ధరణి దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్,పరాస్ జైన్ సమయుక్తంగా నిర్మిస్తున్న "మెరుపు"చిత్రం బడ్జెట్ ను పూర్తి అదుపులో ఉంచాలనీ, అలా గనక చేయలేకపోతే సినిమాని మానుకోండని దర్శక, నిర్మాతలకు రామ్ చరణ్ ఘాటుగా వార్నింగిచ్చాడట.అంటే తన వల్ల తన బాబాయ్ నాగబాబులా మరే నిర్మాతా నష్టపోకూడదని రామ్ చరణ్ ధృఢనిశ్చయంతో ఉన్నాడన్నమాట.