English | Telugu

"మగధీర"ను మించిపోతుందా?

 

పనిగట్టుకుని పలు వివాదాలు పుట్టించి "మగధీర" చిత్రాన్ని ఆల్‌టైమ్ హిట్‌గా నిలబెట్టిన విషయం తెలిసిందే. రాజమౌళికున్న క్రేజ్, కీరవాణి బాణీలతోపాటు, కాజల్ అందాలు కూడా కలిసిరావడంతో "మగధీర" మహా విజయాన్ని సొంతం చేసుకుంది. "పోకిరి" రికార్డుల్ని తిరగరాసి నెంబర్ ఒన్ స్థానం ఆక్రమించుకుంది.

 

 

రామ్‌చరణ్ తాజా చిత్రం "ఎవడు","మగధీర"ను మించిపోవడం ఖాయం అన్నట్లు నిన్న జరిగిన ఆడియో వేడుకలో వక్తలు ప్రసంగాలు చేసారు. "మగధీర" కంటె ఎక్స్‌ట్రార్డనరీగా వచ్చి ఉంటే తప్ప.. "ఎవడు" చిత్రానికి అంత సీన్ ఉండే అవకాశం లేదు. ఎందుకంటె "మగధీర" రిలీజ్ టైమ్‌లో ఇతర పెద్ద హీరోల చిత్రాలేవీ విడుదల కాలేదు. విడుదలైనా.. విజయం సాధించలేదు. కానీ ఇప్పుడు అలా కాదు.. "ఎవడు" విడుదలైన రెండు వారాలకు "అత్తారింటికి దారేది" విడుదల కానుండగా.. ఆ తర్వాత "రామయ్యా వస్తావయ్యా" రిలీజ్ అవ్వనుంది. ఈ రెండు చిత్రాల్లో ఒకటి ఘన విజయం సాధించినా.. "ఎవడు" చిత్రం కలెక్షన్లకు భారీగా గండిపడుతుంది. అయినాసరే.. ఈ చిత్రానికి హైప్ తీసుకురావడం కోసం "మగధీర"తో కంపేర్ చేస్తున్నారు!