English | Telugu

Toxic: టాక్సిక్ తెలుగు బిజినెస్ పరిస్థితి ఇదే.. దిల్ రాజు కట్టిన అమౌంట్ వైరల్ 

Publish Date:Feb 7, 2026

  -టాక్సిక్ కి తెలుగు నాట అంత ఉందా! -ఫ్యాన్స్ ఏమంటున్నారు -రికార్డు స్థాయిలో బిజినెస్    పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద యష్(Yash)సృష్టించుకున్న సామ్రాజ్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. పైగా కేవలం కేజిఎఫ్(Kgf)సిరీస్ తోనే ఆ సామ్రాజాన్ని సృషించుకున్నాడంటే యష్ ఎంతగా అభిమానులు, ప్రేక్షకుల గుండెల్లో కొలువు తీరి ఉన్నాడో అర్ధమవుతుంది. అందుకే వచ్చే నెల 19 న విడుదల  కాబోతున్న 'టాక్సిక్'(Toxic)కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇందుకు తెలుగు ప్రేక్షకులు మినహాయింపు కాదు. అందుకే భారీ రేట్ కి అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగు రాష్ట్రాల హక్కులని పొందాడు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కి సంబంధించిన రిలీజ్ హక్కుల కోసం మూడు అగ్ర సంస్థ‌లు పోటీ పడ్డాయి. చివరికి దిల్ రాజు దక్కించుకున్నాడు.120 కోట్ల రూపాయిల భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఇప్పుడు ఈ విషయం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారడంతో పాటు టాక్సిక్ పై ఉన్న అంచనాలని రెట్టింపు చేస్తున్నాయి. హక్కులని దక్కించుకున్న తర్వాత దిల్ రాజు మాట్లాడుతు 'ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలోని పెద్ద స్టార్స్‌లో య‌శ్ ఒక‌రు. కెజియ‌ఫ్ 2 త‌ర్వాత ఆయ‌న మార్కెట్ మ‌రింత‌గా పెరిగింది. 'టాక్సిక్' కోసం ఆడియెన్స్ ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నారు. నాలుగేళ్ల త‌ర్వాత యష్ నుంచి వస్తుడటంతో అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి ప్రెస్టీజియ‌స్ మూవీని మా ఎస్‌వీసీ బ్యాన‌ర్‌పై తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానుండ‌టం చాలా ఆనందంగా ఉంది. య‌శ్‌తో ఇలాగే మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని ఆశిస్తున్నాం అని చెప్పారు. Also read:  sumathi sathakam: సుమతి శతకం రివ్యూ.. హిట్టా,ఫట్టా! పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కి సిద్దమవుతున్న టాక్సిక్ కి మహిళా దర్శకురాలు గీతూ మోహన్ దాస్(Geethu MOhandas)తెరకెక్కించింది. ఇటీవల టీజర్ రిలీజ్ చెయ్యగా అసభ్యత శృతి మించిందనే  విమర్శలు వస్తున్నాయి. టాక్సిక్ ని ఇంగ్లిష్, కన్నడ లాంగ్వేజ్ లో ఒకేసారి పిక్చరైజ్ చేసిన విషయం తెలిసిందే. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తార సుతారియా తదితరులు ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నారు.రవి బస్రుర్ మ్యూజిక్.        

Funky Trailer: Promising Entertainer

Publish Date:Feb 7, 2026

The FUNKY trailer strikes the right chord instantly, packed with riotous slapstick humour and the unmistakable trademark comedy of KV Anudeep. Bursting with fun in every frame, the trailer feels like a blockbuster add-on that amplifies excitement for what promises to be a complete theatrical entertainer.   Vishwak Sen and Kayadu Lohar look refreshingly vibrant and effortlessly charming together. Their chemistry is a delightful highlight, adding a fresh spark and youthful energy to the film’s narrative. Supported by an ensemble cast loaded with full-on comedy, FUNKY is shaping up to be the ultimate laugh-out-loud entertainer. Bringing together a power-packed team synonymous with humour, chaos and pure entertainment, director KV Anudeep, known for the blockbuster Jathi Ratnalu, returns to his signature comic universe aiming to deliver an even bigger, louder, and crazier cinematic experience with his quirky storytelling and infectious humour.   Music director Bheems Ceciroleo once again proves his flair for foot-tapping compositions, infusing the film with vibrant rhythms and catchy tunes. The film is produced by Naga Vamsi S and Sai Soujanya under the banners of Sithara Entertainments, Fortune Four Cinemas and Srikara Studios. Known for their rich production values and stylish presentation, the makers promise a grand, wholesome entertainer made for the big-screen experience. With quirky characters, a refreshing lead pair, peppy music, and a director celebrated for comic chaos, FUNKY is all set to deliver unlimited entertainment in theatres. FUNKY is scheduled for a grand theatrical release on February 13, 2026, making it the perfect entertainer for the Valentine’s Day weekend. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

సినిమా చూడాలంటే బ్రహ్మానందం ఇప్పటికీ వణికిపోతారు.. ఎందుకో తెలుసా?

Publish Date:Jan 31, 2026

(ఫిబ్రవరి 1 బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా..)   - తను చేసిన 1250 సినిమాల్లో బ్రహ్మానందం చూసినవి 20 మాత్రమే - చిరంజీవిని చూస్తే బ్రహ్మానందం భయపడతారు.. ఎందుకంటే? - చిన్నతనంలో బ్రహ్మానందంని తండ్రి ఎందుకు కొట్టేవారు?   నీ ఎంకమ్మా.. తీస్కో.. పండగ చేసుకో.. రకరకాలుగా ఉంది మాస్టారూ.. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు.. శాల్తీలు లేచిపోతాయ్.. జఫ్ఫా.. ఇరుకుపాలెం వాళ్లంటే ఎకసెక్కాలుగా ఉందా?.. నా పెర్‌ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఎస్.ఎం.ఎస్. చేయండి.. నన్ను ఇన్‌వాల్వ్ చేయకండి రావుగారు.. ఈ పాపులర్ డైలాగులు వింటే చాలు.. అవి చెప్పి మనల్ని నవ్వించిన కమెడియన్ ఎవరో గుర్తొస్తారు. నాలుగు దశాబ్దాలపాటు తిరుగులేని, తీరికలేని కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది హాస్యనటులు వచ్చారు. తమ నటనతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు. పాతతరంలో రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, పద్మనాభం, రాజబాబు వంటి హాస్యనటులు కొన్ని దశాబ్దాలు హాస్యనట చక్రవర్తులుగా ఇండస్ట్రీని ఏలారు.    ఆ తర్వాత వచ్చిన బ్రహ్మానందం తనదైన మార్క్ కామెడీతో, డైలాగులతో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందర్నీ ఎంటర్‌టైన్ చేశారు. 1980వ దశకంలో ఇండస్ట్రీకి వచ్చిన బ్రహానందం.. కొన్ని దశాబ్దాలపాటు తన హాస్యంతో ప్రేక్షకుల్ని అలరించారు. ఒక దశలో బ్రహ్మానందం లేని సినిమా ఉండేది కాదు. డిస్ట్రిబ్యూటర్లు కూడా బ్రహ్మానందం సినిమాలో ఉన్నాడంటే మినిమం గ్యారెంటీగా భావించేవారు. ఒకప్ప్పుడు రాజబాబు, రమాప్రభ కాంబినేషన్‌కి ఈ క్రేజ్ ఉండేది.    నలభై ఏళ్ళ తన సినీ కెరీర్‌లో 1250కి పైగా సినిమాల్లో హాస్యనటుడిగా కనిపించిన బ్రహ్మానందంకి సినిమాలంటే ఎంతో భయమట. అందుకే తను చేసిన వందల సినిమాల్లో కేవలం 20 మాత్రమే చూశారు. సినిమా నటుడై ఉండి, తన నటనతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే బ్రహ్మానందంకి సినిమాలంటే ఎందుకు విరక్తి కలిగింది? సినిమాల విషయంలో అతన్ని భయపెట్టింది ఎవరు? అనే విషయాల గురించి తెలుసుకుందాం.   1956 ఫిబ్రవరి 1న  గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం, చాగంటివారిపాలెంలో కన్నెగంటి నాగలింగాచారి, లక్ష్మీనరసమ్మ దంపతులకు ఎనిమిది మంది సంతానంలో ఒకరుగా జన్మించారు కన్నెగంటి బ్రహ్మానందం. సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో టెన్త్ వరకు చదువుకున్నారు. పై చదువులకు వెళ్లేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో తండ్రికి సన్నిహితుడైన సున్నం ఆంజనేయులు సహకారంతో భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇం{ర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరు పీజీ సెంటర్‌లో తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. చేశారు. ఆ తర్వాత 9 సంవత్సరాలపాటు అత్తిలిలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు బ్రహ్మానందం.    చిన్నతనంలో సినిమాలు చూడాలని ఎంతో ఆసక్తిగా ఉండేది. కానీ, తండ్రి సినిమాలకు పంపేవారు కాదు. సంవత్సరానికి ఒక సినిమా చూస్తే గగనం అన్నట్టుగా ఉండేది.  అయితే తండ్రికి తెలియకుండా సోదరులతో కలిసి సెకండ్ షోలకు వెళ్లేవారు. అలా వెళ్లినప్ప్పుడల్లా తండ్రి వారిని చితకబాదేవారు. తన్నులు తిన్నా సినిమాలు చూడడం మానేవారు కాదు. ఆ తర్వాతి కాలంలో సినిమా చూడాలంటే తండ్రి కొట్టిన దెబ్బలే గుర్తొచ్చేవి.    ఇక సినిమాల్లోకి వచ్చి గ్రేట్ కమెడియన్ అనిపించుకున్న తర్వాత కూడా సినిమాలంటే భయం పోలేదు. సినిమాల విషయంలో తండ్రి అతన్ని శిక్షించిన తీరు అలా ఉండేది. తను చేసే సినిమాల ద్వారా ప్రేక్షకుల్ని నవ్విస్తున్నప్పటికీ తను మాత్రం సినిమాలకు దూరంగానే ఉంటారు. అందుకే ఆయన చూసిన సినిమాలు చాలా తక్కువ. సినిమా అనగానే ఇప్పటికీ చిన్నతనంలో తండ్రి కొట్టిన దెబ్బలే గుర్తొస్తాయని అంటారు. అలాగే చిరంజీవిని చూసినా బ్రహ్మానందం భయపడతారు. దానికి కారణం.. తను సినిమాల్లోకి రాకముందు చిరంజీవి వంటి స్టార్ హీరోని కలిసినపుడు మాట్లాడేందుకు ఎంత భయపడ్డారో ఇప్ప్పుడు కూడా ఆయన కలిసినపుడు పైకి బాగానే మాట్లాడినా మనసులో మాత్రం వణుకు పుడుతుందంటారు బ్రహ్మానందం.

Rajpal yadav: లొంగిపోయిన అగ్ర కమెడియన్.. తీహార్ జైలుకి తరలింపు

Publish Date:Feb 6, 2026

    -రాజ్ పాల్ యాదవ్ చేసిన నేరం ఏంటి! -ఎందుకు తీహార్ జైలులో లొంగిపోయాడు -అసలు కేసు ఏంటి! -ఎప్పటినుచి నడుస్తుంది   అభిమానులు, మూవీ లవర్స్ తరచు తమ నోటి నుంచి హీరోలు చెప్పిన డైలాగ్స్ నే కాదు. కమెడియన్ చెప్పిన డైలాగ్స్ ని హమ్ చేస్తుంటారు. కాకపోతే ఏ కొంత మంది కమెడియన్స్ కో ఆ అదృష్టం దక్కుతుంది. అలాంటి అదృష్టాన్ని దక్కించుకున్న స్టార్ కమెడియన్ రాజ్ పాల్ యాదవ్. తన నోటి నుంచి వచ్చిన ఎన్నో డైలాగులు ఇండియన్ సినిమా మూవీ లవర్స్ ని  ఉర్రుతలూగించాయి. అలాంటి రాజ్ పాల్ యాదవ్ ఇప్పుడు తీహార్ జైలు ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు దారి తీసిన కారణాలని చూద్దాం.   మురళి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దగ్గర రాజ్ పాల్ యాదవ్, అయన సతీమణి కొంత డబ్బు అప్పు తీసుకున్నారు. తీసుకున్న డబ్బులకి చెక్కులు ఇచ్చారు. కానీ చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో మురళి ప్రాజెక్ట్స్ ఢిల్లీ మేజిస్ట్రేట్ కోర్ట్ ని ఆశ్రయించగా సదరు కోర్ట్ రాజ్ పాల్ దంపతులని దోషులుగా తేల్చి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఈ కేసు ని సవాలు చేస్తూ రాజ్ పాల్ ఢిల్లీ హైకోర్టు ని సంప్రదిస్తే రాజ్ పాల్ డబ్బు చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో ఇరువురు రాజీపడాలని సూచించింది. కానీ రాజ్ పాల్ మాత్రం డబ్బు చెల్లించలేదు. ఈ కేసులోనే రీసెంట్ గా ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం రాజ్ పాల్  తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయాడు.2018 వ సంవత్సరం నుంచి సదరు కేసు నడుస్తూ ఉండటం గమనార్హం.   Also read:  sri chidambaram garu: శ్రీ చిదంబరం గారు మూవీ రివ్యూ    1999 లో సినీ రంగ ప్రవేశం చేసిన రాజ్ పాల్ ఇప్పటి వరకు సుమారు 120 సినిమాల వరకు చేసాడు. ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో భూత్ బంగ్లా, వెల్ కమ్ టూ ది జంగిల్ వంటి చిత్రాలు ఉన్నాయి. రచయితగా, దర్శకుడు గా కూడా తన సత్తా చాటాడు. రవితేజ, సురేందర్ రెడ్డి, కళ్యాణ్ రామ్ ల కిక్ పార్ట్ 2 లో కూడా తనదైన కామెడీ టైమింగ్ తో కిక్ ని ఇచ్చాడు.        

Brahmamudi : రాజ్ కి మినిస్టర్ బిడ్డని ఇస్తాడా.. రుద్రాణి ప్లాన్ ఏంటి!

Publish Date:Feb 7, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -949 లో.....రాజ్, కావ్య ఇద్దరు మాట్లాడుకుంటారు. ఈ రోజుతో ఆ మినిస్టర్ కి మనం అంటే ఏంటో తెలిసిందని రాజ్ అంటాడు. ఏమో అండి వాడి భార్య మీద ఉన్న ప్రేమ వాడి బలహీనత..‌అది కాస్త వాడి ధైర్యం అయితే మనం ఏం చెయ్యలేమని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్య తరుచుగా తులసి దగ్గరికి వస్తుంది. ఇద్దరు క్లోజ్ అవుతారు. కావ్య రోజు ఇంటికి వస్తుంటే మినిస్టర్ కి భయం వేస్తుంది. రోజులు గడిచే కొద్దీ భయం పెరుగుతుంది. మినిస్టర్ నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తాడు.. ఇలా భయం భయంగా బ్రతకడం నా వాళ్ళ కాదని అనుకుంటాడు. నా భార్యకి నిజం చెప్తానని మినిస్టర్ ఫిక్స్ అవుతాడు. దాంతో ఆ రోజు రాత్రి తులసి దగ్గరికి వెళ్తాడు. నువ్వు కావ్యకి హెల్ప్ చేయమన్నావ్ కదా.. ఆ బిడ్డను మార్చిన అతను ఏ పరిస్థితిలో మార్చాడో మనకి తెలియదు కదా అని మినిస్టర్ అనగానే ఏ పరిస్థితి ఏంటి అలా చేయడం తప్పు.. వాడు కనిపిస్తే చెప్పుతో కొడతానని తులసి అంటుంది. ఆ పని మీరు చేసినా నేను ఊరుకోను.. అయినా మీరు అలా చేస్తే నేను బ్రతుకుతానా అని తులసి అనగానే మినిస్టర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రాజ్ కి ఫోన్ చేసి కలవాలని అంటాడు. రాజ్ నేను నా బిడ్డ ని నీకు ఇవ్వలేనని మినిస్టర్ అంటాడు. నీ బిడ్డ కాదు మా బిడ్డ అని రాజ్ అంటాడు. నా భార్య బిడ్డకి దూరంగా ఉండి ఎంత బాధ పడుతుందో మీకేమైనా తెలుస్తుందా అని రాజ్ కోప్పడుతాడు. మీరే నా బిడ్డని తీసుకొని వచ్చి నాకు ఇవ్వండి అని రాజ్ అంటాడు. ఆ తర్వాత మినిస్టర్, రుద్రాణి మాట్లాడుకుంటారు. మనం చేసింది తప్పు అని మినిస్టర్ అనగానే అలా వెనకడుగు వేస్తారేంటని రుద్రాణి అంటుంది. తప్పు అయినా నీ భార్య హ్యాపీగా ఉంది కదా అని మినిస్టర్ ని రుద్రాణి కంట్రోల్ చేస్తుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మికి రుద్రాణి ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మార్కో డైరెక్టర్ తో బాలయ్య.. మాస్ సంభవం!

Publish Date:Feb 1, 2026

  ఒక్కోసారి ఊహించని కాంబినేషన్స్ సెట్ అవుతుంటాయి. ఆ కాంబినేషన్ ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు అలాంటి కాంబోనే సెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), 'మార్కో' దర్శకుడు హనీఫ్ అదెని(Haneef Adeni) చేతులు కలుపుతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.   బాలకృష్ణ ప్రస్తుతం తన 111వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఆ తర్వాత పలు ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయి. వాటిలో దిల్ రాజు బ్యానర్ లో చేయనున్న ప్రాజెక్ట్ కూడా ఉంది. అయితే ఈ సినిమా డైరెక్టర్ గా వంశీ పైడిపల్లి సహా పలువురు పేర్లు వినిపించాయి. ఇప్పుడు అనూహ్యంగా హనీఫ్ పేరు తెరపైకి వచ్చింది.   రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన మలయాళ సినిమాలలో 'మార్కో' ఒకటి. ఉన్ని ముకుందన్ హీరోగా హనీఫ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. మోస్ట్ వయలెంట్ ఇండియన్ ఫిలిమ్స్ లో ఒకటిగా పేరు పొందింది. అలాంటి వయలెంట్ డైరెక్టర్ తో దిల్ రాజు ప్రొడక్షన్స్ గతేడాది ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేసింది. కానీ హీరోను మాత్రం రివీల్ చేయలేదు. అయితే ఆ ప్రాజెక్ట్ లో నటించనున్న హీరో బాలకృష్ణనే అని ప్రచారం జరుగుతోంది.   బాలకృష్ణ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన మాస్ ఇమేజ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అలాంటి బాలకృష్ణను వయలెంట్ డైరెక్టర్ హనీఫ్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనే ఆసక్తిని కలిగిస్తోంది. ఇక నిజంగానే ఈ కాంబో సెట్ అయితే థియేటర్లు షేక్ అవుతాయి అనడంలో డౌట్ లేదు.  

Mega Swap: Pawan Kalyan UBS for Ram Charan Peddi

Publish Date:Feb 3, 2026

Mega Family stars seem to swap the release dates according to insider buzz. The reports suggest that Pawan Kalyan starrer Ustaad Bhagat Singh, directed by Harish Shankar and produced by Mythri Movie Makers is set for a worldwide release on 26th March 2026, in place of already scheduled Ram Charan's Peddi.  The change comes as Ram Charan and his wife, Upasana Konidela, recently welcomed twins—a baby boy and a baby girl—on January 31, 2026. Earlier, Charan had informed director Buchi Babu Sana and the Peddi team that he would be unavailable for at least three to four weeks after the delivery to spend time with his family. While Charan gave extra dates before the delivery to finish the film, some shoot delays occurred. Director Buchi Babu Sana reportedly asked for more time to perfect important sequences in the second half of the movie to deliver the best quality product. Charan is now expected to return to the sets in March to finish the remaining portions. So, Mythri Movie Makers, who are also presenting Peddi, have decided that releasing Ustaad Bhagat Singh will be perfect for that weekend. Currently, they have fast tracked the post production works to finish the film in time and start promotions for the release date. Official confirmation will arrive in few days, it seems.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

Om Shanti Shanti Shantihi

Publish Date:Dec 31, 1969

Nari Nari Naduma Murari

Publish Date:Dec 31, 1969

Anaganaga Oka Raju

Publish Date:Dec 31, 1969