English | Telugu

‘దేవర’కి ఆ ఛాన్స్‌ లేదు.. ఈ విషయంలో తగ్గేదేలే.. అంటున్న ‘పుష్ప2’!

‘సలార్‌’ సందడి, సంక్రాంతి సందడి ముగిసింది. ఇప్పుడందరి చూపూ ఎన్టీఆర్‌ ‘దేవర’, అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ పైనే ఉంది. ఈ రెండు సినిమాల రిలీజ్‌ డేట్స్‌పైనే  చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఏప్రిల్‌ 5న విడుదల కావాల్సిన ‘దేవర’ పోస్ట్‌ పోన్‌ అయ్యిందన్న వార్తలు వస్తున్నాయి. మరోపక్క ‘పుష్ప2’ ఆగస్ట్‌ 15కి రిలీజ్‌ చేస్తామని చిత్ర యూనిట్‌ ఎప్పుడో ప్రకటించింది. ఇప్పుడు ఈ సినిమా కూడా వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతోంది. అందుకే ‘పుష్ప2’ రిలీజ్‌ డేట్‌కి ‘దేవర’ని తీసుకొస్తారని చెప్పుకుంటున్నారు. తాజాగా ప్రచారంలోకి వచ్చిన ఈ వార్తపై అల్లు అర్జున్‌ కాంపౌండ్‌ నుంచి విశ్వసనీయంగా ఓ వార్త వినిపిస్తోంది. 

ఈమధ్యకాలంలో ‘సలార్‌’ తర్వాత ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘పుష్ప2’. ఎందుకంటే ‘పుష్ప’ దేశవ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం అలాంటిది. కమర్షియల్‌గా ఘనవిజయం సాధించడమే కాకుండా జాతీయ అవార్డులు సైతం సొంతం చేసుకుంది. మరి ఈ సినిమాకి సీక్వెల్‌ వస్తోందంటే బజ్‌ మామూలుగా ఉండదుగా. ‘పుష్ప2’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అల్లు అర్జున్‌ కాంపౌండ్‌ నుంచి వినిపిస్తున్న మాట ఏమిటంటే.. చిత్ర యూనిట్‌ ఎనౌన్స్‌ చేసిన డేట్‌కే సినిమాని రిలీజ్‌ చెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ కొంత బ్యాలెన్స్‌ ఉంది. అది కాస్తా డిలే కావడంతో రిలీజ్‌ పోస్ట్‌ పోన్‌ అవుతుందనే వార్తలు పుట్టుకొస్తున్నాయి. దానికి కారణం నటుడు జగదీష్‌. ఓ అమ్మాయి ఆత్మహత్య కేసులో అరెస్టయిన జగదీష్‌కి సంబంధించిన పోర్షన్‌ బ్యాలెన్స్‌ ఉంది. కొన్నాళ్ల క్రితమే పదిహేను లక్షలు ఖర్చుపెట్టి జగదీష్‌ను బెయిల్‌పై బయటికి తీసుకొచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం అతను షూటింగ్‌లో పాల్గొంటున్నాడని, వీలైనంత త్వరగా అతని క్యారెక్టర్‌కి సంబంధించిన షూటింగ్‌ పూర్తి చెయ్యాలని సుకుమార్‌ భావిస్తున్నాడని తెలుస్తోంది. ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా సెట్‌లో జరుగుతోంది అదేనని సమాచారం. 

‘దేవర’ టీమ్‌ భావిస్తున్నట్టు ‘పుష్ప2’ని ఆగస్ట్‌ 15కి రిలీజ్‌ చెయ్యడం కష్టమైన పనేమీ కాదు. యూనిట్‌ చెప్పిన రిలీజ్‌ డేట్‌కి ఇంకా ఆరు నెలలు టైమ్‌ ఉంది కాబట్టి ఇదే వేగంతో షూటింగ్‌ పూర్తి చేసెయ్యాలని సుకుమార్‌ టీమ్‌ భావిస్తోందట. ఇక ప్రమోషన్స్‌ కోసం ఒక నెలరోజులు కేటాయించాల్సి ఉంటుంది.  టైమ్‌ దొరకని పక్షంలో ప్రమోషన్ల విషయంలో ‘సలార్‌’ని ఫాలో అయితే సరిపోతుందనే ఆలోచన కూడా ఉందట. సినిమా రిలీజ్‌ అయిన తర్వాతే ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆగస్ట్‌ 15కే ‘పుష్ప2’ని రిలీజ్‌ చెయ్యాలని చిత్ర యూనిట్‌ ఫిక్స్‌ అయింది కాబట్టి దానికి తగ్గట్టుగానే స్పీడ్‌ పెంచారని తెలుస్తో‘దేవర’కి ఆ ఛాన్స్‌ ఇచ్చేదే లేదు.. ఈ విషయంలో తగ్గేదేలే.. అంటున్న ‘పుష్ప2’!

‘సలార్‌’ సందడి, సంక్రాంతి సందడి ముగిసింది. ఇప్పుడందరి చూపూ ఎన్టీఆర్‌ ‘దేవర’, అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ పైనే ఉంది. ఈ రెండు సినిమాల రిలీజ్‌ డేట్స్‌పైనే  చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఏప్రిల్‌ 5న విడుదల కావాల్సిన ‘దేవర’ పోస్ట్‌ పోన్‌ అయ్యిందన్న వార్తలు వస్తున్నాయి. మరోపక్క ‘పుష్ప2’ ఆగస్ట్‌ 15కి రిలీజ్‌ చేస్తామని చిత్ర యూనిట్‌ ఎప్పుడో ప్రకటించింది. ఇప్పుడు ఈ సినిమా కూడా వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతోంది. అందుకే ‘పుష్ప2’ రిలీజ్‌ డేట్‌కి ‘దేవర’ని తీసుకొస్తారని చెప్పుకుంటున్నారు. తాజాగా ప్రచారంలోకి వచ్చిన ఈ వార్తపై అల్లు అర్జున్‌ కాంపౌండ్‌ నుంచి విశ్వసనీయంగా ఓ వార్త వినిపిస్తోంది. 

ఈమధ్యకాలంలో ‘సలార్‌’ తర్వాత ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘పుష్ప2’. ఎందుకంటే ‘పుష్ప’ దేశవ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం అలాంటిది. కమర్షియల్‌గా ఘనవిజయం సాధించడమే కాకుండా జాతీయ అవార్డులు సైతం సొంతం చేసుకుంది. మరి ఈ సినిమాకి సీక్వెల్‌ వస్తోందంటే బజ్‌ మామూలుగా ఉండదుగా. ‘పుష్ప2’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అల్లు అర్జున్‌ కాంపౌండ్‌ నుంచి వినిపిస్తున్న మాట ఏమిటంటే.. చిత్ర యూనిట్‌ ఎనౌన్స్‌ చేసిన డేట్‌కే సినిమాని రిలీజ్‌ చెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ కొంత బ్యాలెన్స్‌ ఉంది. అది కాస్తా డిలే కావడంతో రిలీజ్‌ పోస్ట్‌ పోన్‌ అవుతుందనే వార్తలు పుట్టుకొస్తున్నాయి. దానికి కారణం నటుడు జగదీష్‌. ఓ అమ్మాయి ఆత్మహత్య కేసులో అరెస్టయిన జగదీష్‌కి సంబంధించిన పోర్షన్‌ బ్యాలెన్స్‌ ఉంది. కొన్నాళ్ల క్రితమే పదిహేను లక్షలు ఖర్చుపెట్టి జగదీష్‌ను బెయిల్‌పై బయటికి తీసుకొచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం అతను షూటింగ్‌లో పాల్గొంటున్నాడని, వీలైనంత త్వరగా అతని క్యారెక్టర్‌కి సంబంధించిన షూటింగ్‌ పూర్తి చెయ్యాలని సుకుమార్‌ భావిస్తున్నాడని తెలుస్తోంది. ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా సెట్‌లో జరుగుతోంది అదేనని సమాచారం. 

‘దేవర’ టీమ్‌ భావిస్తున్నట్టు ‘పుష్ప2’ని ఆగస్ట్‌ 15కి రిలీజ్‌ చెయ్యడం కష్టమైన పనేమీ కాదు. యూనిట్‌ చెప్పిన రిలీజ్‌ డేట్‌కి ఇంకా ఆరు నెలలు టైమ్‌ ఉంది కాబట్టి ఇదే వేగంతో షూటింగ్‌ పూర్తి చేసెయ్యాలని సుకుమార్‌ టీమ్‌ భావిస్తోందట. ఇక ప్రమోషన్స్‌ కోసం ఒక నెలరోజులు కేటాయించాల్సి ఉంటుంది.  టైమ్‌ దొరకని పక్షంలో ప్రమోషన్ల విషయంలో ‘సలార్‌’ని ఫాలో అయితే సరిపోతుందనే ఆలోచన కూడా ఉందట. సినిమా రిలీజ్‌ అయిన తర్వాతే ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆగస్ట్‌ 15కే ‘పుష్ప2’ని రిలీజ్‌ చెయ్యాలని చిత్ర యూనిట్‌ ఫిక్స్‌ అయింది కాబట్టి దానికి తగ్గట్టుగానే స్పీడ్‌ పెంచారని తెలుస్తోంది.