English | Telugu

ప్రియమణి ప్రేమించింది ఈ అంకుల్‌నేనా?

 

మొన్నటి వరకూ నాలుగు దక్షిణాది భాషల్లో హీరోయిన్‌గా బిజీగా వున్న ప్రియమణి ప్రస్తుతం వేషాల్లేక, పిలిచేవారు లేక గోళ్ళు గిల్లుకుంటోంది. ఇలాంటి మూమెంట్లో ఆమె మీద రూమర్లు విజృంభిస్తున్నాయి. ప్రియమణి కన్నడ సినీ రంగానికి చెందిన గోవింద్ అనే నటుడితో చాలా సన్నిహితంగా వుందని, ఇప్పటికే ఆల్రెడీ పెళ్ళయి, పిల్లలు కూడా వున్న అతగాడి ప్రేమలో పీకల్లోతు వరకూ కూరుకుపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. సదరు గోవింద్ అనే నటుడు కూడా ఈమధ్య ప్రియమణితో తాను చాలా సన్నిహితంగా వున్న ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే సదరు ఫొటోలు మాత్రం ఇంతవరకు బయటపడలేదు. ప్రస్తుతం కన్నడ సినిమా రంగంలో గోవింద్ అనే నటుడు ఒకరు మాత్రమే వున్నాడు. సదరు గోవింద్‌కి ప్రియమణిని పడేసేంత పర్సనాలిటీ గానీ, స్టార్‌డమ్‌గానీ లేవు. అందుకే ప్రియమణి ప్రేమిస్తోన్న గోవింద్ ఇతనా, కాదా.. మరో గోవింద్ ఎవరైనా వున్నారా అనే సందేహాలు దక్షిణాదిలో వున్నాయి. అయితే ఈ పుకార్లు, సందేహాల విషయంలో ప్రియమణిగానీ, సదరు అంకుల్ పర్సనాలిటీ వున్న గోవింద్ గానీ స్పందించడం లేదు.. ఖండించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రియమణి ప్రేమిస్తున్నది ఈ అంకుల్‌గారినేనా అనే సందేహాలు మరింత బలపడుతున్నాయి.