English | Telugu

మలయాళం హీరోయిన్ హాట్ ‘ఓపెన్’ ఆఫర్!

 

బొద్దుగా, ముద్దుగా వుండే మలయాళీ హీరోయిన్ లక్ష్మీ మీనన్ అంటే కేరళ ప్రేక్షకులకు చాలా ఇష్టం. అచ్చమైన మలయాళీ అమ్మాయిలా, పక్కింటి అమ్మాయిలా వుండే ఈ బొద్దుగుమ్మ ఈమధ్యకాలంలో మలయాళ సినిమా రంగంలో అగ్రస్థాయి హీరోయిన్‌గా వెలుగుతోంది. రేపో మాపో కోటి రూపాయలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఆమధ్య మలయాళంలో విడుదలైన ‘కుంకి’ అనే సినిమాలో కొండప్రాంతాల్లో నివసించే అమ్మాయిగా నటించిన లక్షీ మీనన్ కేరళలోని కుర్రకుంకలకి చాలారోజులు నిద్రలేకుండా చేసింది. కొన్ని సినిమాల్లో బుద్ధిగా వుండే అమ్మాయి పాత్రల్లో నటించిన లక్ష్మీ మీనన్ ఇప్పుడు రూటు మార్చి గ్లామర్ పాత్రల మీద దృష్టి సారించింది. మొన్నామధ్య విడుదలైన తమిళ సినిమా ‘నాన్ శిగప్పు మనిదన్’ సినిమాలో కుర్రహీరో విశాల్‌తో ఏకంగా లిప్‌లాక్ సన్నివేశాల్లో లీనమై నటించేసింది. అదేమంటే కథ డిమాండ్ మేరకే నటించాల్సి వచ్చిందని చెప్పింది. ఆ తర్వాత దేనికైనా రెడీ అంటూ అందాల గేట్లు తెరిచేసింది. తెరమీద ముద్దు సీన్లలో నటించడానికి తనకి ఎలాంటి ఇబ్బందీ లేదని చెబుతోంది. ప్రస్తుతం యాభై కోట్ల మార్కెట్‌ సంపాదించిన లక్ష్మీ మీనన్ త్వరలో కోటి క్లబ్‌లో చేరాలని అనుకుంటోంది. తనకు కోటి పారితోషికం ఎవరైనా ఇస్తే సదరు సినిమాలో ఏ టైపులో యాక్ట్ చేయమన్నా సిగ్గుపడకుండా చేసేస్తానని ఓపెన్ హాట్ ఆఫర్ ఇచ్చేసింది.