English | Telugu

కామెడీయన్ గా ప్రకాష్ రాజ్..!

తెలుగు సినిమాల్లో ప్రకాష్ రాజ్ విలన్ గానో, సెంటిమెంటల్ ఫాదర్ గానో, శాడిస్ట్ కిల్లర్ గానో చూశాం కానీ, అవుట్ అండ్ అవుట్ కామెడియన్ గా చూడలేదు. మా సినిమాలో ఆ లోటు తీరుతుందని అంటున్నారు 'పిల్లా నువ్వు లేని జీవితం' చిత్ర యూనిట్ సభ్యులు. ఈ సినిమాలో సెకండాఫ్ లో ప్రకాష్ రాజ్ అద్భుతమైన కామెడీ పండించాడని అంటున్నారు. తెలుగు ప్రేక్షకులను ఆయన కడుపుబ్బ నవ్విస్తారని చెబుతున్నారు. మరి ఆయన ఏ మాత్రం నవ్వించాడో తెలుసుకోవాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని నవంబర్ 14న ప్రేక్షుకుల ముందుకు రాబోతోంది.