English | Telugu
సూర్యతో '24’ చేస్తున్న విక్రమ్..!
Updated : Nov 13, 2014
'మనం'తో అద్భుతమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన దర్శకుడు విక్రమ్. ఇప్పుడు తన తరువాతి సినిమాని తమిళ్ సూపర్ స్టార్ తో సూర్యతో చేయబోతున్నారట. ఈ సినిమాకు '24’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. మనం చూసి బాగా ఇంప్రెస్ అయిన సూర్య వెంటనే తనతో ఒక సినిమా చేయమని ప్రపోజల్ పెట్టాడు. విక్రమ్ కుమార్ చెప్పిన కథ బాగా నచ్చడంతో సూర్య ఈ చిత్రాన్ని తనే నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణ బాధ్యతలు సూర్య భార్య, నటి జ్యోతిక చూసుకోనుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మనం’ సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ పి.ఎస్.వినోద్, ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ మరోసారి విక్రమ్ కుమార్ తో కలసి పనిచేయనున్నారు. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.