English | Telugu

పవన్ కళ్యాణ్ రివాల్వర్ తిరిగి తీసుకోలేదు

పవన్ కళ్యాణ్ రివాల్వర్ తిరిగి తీసుకోలేదు ఎందుకని ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ మొదలైంది. వివరాల్లోకి వెళితే గతంలో అంటే 2007 లో మెగాస్టార్ కుమార్తె శ్రీజ తన ప్రేమ వివాహం సందర్భంగా తన భర్త శిరిష్ భరద్వాజకు ప్రాణహాని ఉందని మీడియా ముందర భయపడటంతో, ఆమె భయం పోగొట్టటానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన వద్ద ఉన్న లైసెన్స్ డ్ రివాల్వర్ ను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో హ్యాండోవర్ చేశారు. అప్పుడే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ సెల్ ఒకటి ఏర్పాటు చేసి, దానికి కార్పస్ ఫండ్ గా కోటి రూపాయలు కూడా ఏర్పాటు చేశారు. అదేమయ్యిందో ఇంతవరకూ తెలియదు.

ఇక విషయంలో వస్తే అది జరిగి ఇప్పటికి నాలుగేళ్ళవుతున్నా కారణం తెలియదు కానీ ఇంతవరకూ పవన్ కళ్యాణ్ తన 60 యమ్ యమ్ రివాల్వర్ ను ఇంతవరకూ తిరిగి తీసుకోలేదు. మామూలుగా పవన్ కళ్యాణ్ కి షూటింగంటే చాలా ఇష్టం. ఇక్కడ షూటింగంటే సినిమా షూటింగని కాదు...రివాల్వర్ షూటింగని అర్థం. ఆ ఇష్టం వల్లనే పవన్ కళ్యాణ్ రివాల్వర్ కొనటం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ కి ప్రస్తుతం ఆ రివాల్వర్ మోజు తగ్గినట్టుంది. అందుకే జూబ్లీ హిల్స్ పోలీసులు ఆ రివాల్వర్ ని ఆయనకు తిరిగి ఇస్తామన్నా తీసుకోవటానికి పవన్ కళ్యాణ్ పెద్దగా ఆసక్తి కనబరచటం లేదట.