English | Telugu
గబ్బర్ సింగ్ లో సిక్స్ ప్యాక్ తో పవన్
Updated : Jul 26, 2011
"గబ్బర్ సింగ్" లో సిక్స్ ప్యాక్ తో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారట. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సారాజేన్ దియాస్ హీరోయిన్ గా, హరీష్ శంకర్ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న చిత్రం" గబ్బర్ సింగ్". ఈ "గబ్బర్ సింగ్" చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నారట. ఈ "గబ్బర్ సింగ్" చిత్రానికి బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సూపర్ హిట్టయిన "దబాంగ్" చిత్రం మాతృక. "గబ్బర్ సింగ్" సినిమాలో అడవి శేష్, అంజలి లావణ్య మరో జంటగా నటించనున్నారు.
ఈ "గబ్బర్ సింగ్" చిత్రం కోసం సిక్స్ ప్యాక్ సాధించేందుకు పవన్ కళ్యాణ్ వ్యాయామం చేస్తున్నారట.మామూలుగా హీరో పవన్ కళ్యాణ్ స్లిమ్ గా ఒక కాలేజ్ స్టూడెంట్ లా కనిపిస్తారు. దానికి తోడు ఆయన సిక్స్ ప్యాక్ కూడా సాధిస్తే పవర్ స్టార్ అన్న పేరుకి యదార్థంగా సార్థకత చేకూరుతుంది. "గబ్బర్ సింగ్" సినిమా ఆగస్ట్ లో షూటింగ్ ప్రారంభించుకోనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.