English | Telugu
వేదాంతధోరణిలో అనుష్క
Updated : Jul 27, 2011
వేదాంతధోరణిలో అనుష్క ఉంటోందని అంటున్నారు. ఆమె మాTలు కూడా దాన్నే నిరూపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తూ నిర్మించిన "సూపర్" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అందాల యోగా టీచర్ అనుష్క అనతి కాలంలోనే స్టార్ డమ్ ని సోంతం చేసుకుంది. ఆమె నటించిన "అరుంధతి" చిత్రం సూపర్ హిట్టయ్యింది. ఆ సినిమాతో అనుష్క మంచి నటిగా కూడా నిరూపించుకుంది.
అలాంటి అనుష్క "మనం అనుకున్నామని ఏదీ జరుగదు. జరిగేదంతా మన మంచికే అనుకోవటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఏది ఎలా జరగాలనుందో అది అలా జరుగుతుంది. అంతా భగవంతుడు నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. మన చేతుల్లో ఏమీ లేదు" అంటోంది. అనుష్కలో వచ్చిన ఈ వేదాంత ధోరణకీ , వైరాగ్యానికీ కారణాలేంటో మనకు తెలియదు. కానీ ఆమె మాటల్లో మాత్రం ఎక్కడో, ఏదో బలమైన దెబ్బతిన్నట్టు చాలా మార్పు కనపడుతూంది.