English | Telugu

పవన్ కళ్యాణ్ హీరోగా పూరీ సినిమా...?

పవన్ కళ్యాణ్ హీరోగా పూరీ సినిమా చేయబోతున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే 2000 వ సంవత్సరంలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన "బద్రి" సూపర్ డ్యూపర్ హిట్టయ్యింది. ఆ సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమయ్యారు పూరీ జగన్నాథ్. ఆ తర్వాత ఆయన తీసిన "పోకిరి" రికార్డులు బ్రేక్ చేసింది. ఆయన ఇటీవల ఆలిండియా సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ హీరోగా తీసిన "బుడ్డా" హోగా తేరా బాప్ సినిమా కూడా మంచి హిట్టయ్యింది.

 

ప్రస్తుతమ పూరీ "ది బిజినెస్ మ్యాన్" గన్స్ డోంట్ నీడ్ ఎగ్రిమెంట్ అనే సినిమాని ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా  తీయటానికి సిద్ధమవుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం "ది షాడో"( "కాళీ" ) చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో, గణేష్ నిర్మించబోయే "గబ్బర్ సింగ్" చిత్రంలో నటిస్తారు. దీని తర్వాత కాంగ్రెస్ పి.సి.సి.చీఫ్ బొత్స సత్యనారాయణ జీవిత చరిత్ర ఆధారంగా, గణేష్ నిర్మించబోయే చిత్రంలో, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తారట. ఆ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారట. అదీ సంగతి...