English | Telugu

పవన్ గబ్బర్ సింగ్ నిర్మాతగా గణేష్

పవన్ గబ్బర్ సింగ్ నిర్మాతగా గణేష్ వ్యవహరిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే బాలీవుడ్ లో కండల కాంతారావు అదేనండీ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన "దబాంగ్" చిత్రాన్ని తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా "గబ్బర్ సింగ్" పేరుతో నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హీరో పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని తను నెలకొల్పిన "పవన్ కళ్యాణ్ క్రియెటీవ్ వర్క్స్" పతాకంపై నిర్మిస్తారని వినపడింది. కానీ స్క్రిప్ట్ వర్క్ చూసుకోవటం, ప్రొడక్షన్ చూసుకుంటూ హీరోగా నటించటమంటే ఎవరికైనా కష్టసాధ్యమైన వ్యవహారం.

అదీ గాక "గబ్బర్ సింగ్" సినిమా తీయటానికి అవసరమైన ధనాన్ని ఏర్పాటు చేయటం, అవసరమైతే ఫైనాన్స్ తీసుకురావటం, పంపిణీ చేయించటం, వంటి వ్యవహారాలు చూసుకుంటూ హీరోగా ఈ సినిమాలో నటించటం ఇబ్బందికరంగా ఉంటుంది గనక ఈ "గబ్బర్ సింగ్" సినిమాని నిర్మించటానికీ, నిర్మాణపు వ్యవహారాలు చూసుకోటానికీ గణేష్ ని నియమిస్తున్నారని తెలిసింది. గణేష్ కి పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, రవితేజ హీరోగా, "ఆంజనేయులు" చిత్రాన్నీ, ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా "తీన్ మార్" చిత్రాన్నీ నిర్మించిన అనుభవం ఉంది. ఇదెంతవరకూ నిజమో కాలమే చెప్పాలి.