English | Telugu

"గబ్బర్ సింగ్"లో మలైకా అరోరా

"గబ్బర్ సింగ్"లో మలైకా అరోరా నటించనుందని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్‍ పవన్ కళ్యాణ్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్ గా, హరీష్ శంకర్ దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మిస్తున్న చిత్రం" గబ్బర్ సింగ్". ఈ "గబ్బర్ సింగ్" చిత్రానికి మాతృక సల్మాన్ ఖాన్ హీరోగా నటించగా, సూపర్ హిట్టయిన హిందీ చిత్రం "దబాంగ్". ఈ "దబాంగ్" చిత్రంలో "మున్నీ బద్నామ్ హోగయి డారిలింగ్ తేరేలియే" అన్న పాట సూపర్ డూపర్ హిట్టయ్యింది.

ఆ పాటలో నటించిన నటి మలైకా అరోరాని తెలుగులో "గబ్బర్ సింగ్" చిత్రంలో కూడా నటింపజేస్తున్నారని వినపడుతూంది. ఇదెంతవరకూ నిజమో కానీ అదే గనక జరిగితే ఈ"గబ్బర్ సింగ్" చిత్రానికి ఆ పాట కచ్చితంగా ప్లస్సవుతుందనటంలో సందేహం లేదు.