English | Telugu

రవితేజ కోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నాడా! 

ఫిలిం సర్కిల్స్ లో ఒక వెరీవెరీ స్పెషల్ న్యూస్ శరవేగంగా చక్కర్లు కొడుతుంది. అదే కనుక జరిగితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan)అండ్ మాస్ మహారాజా రవితేజ(ravi teja) అభిమానుల్లో నూతన ఉత్సాహం వచ్చినట్టే. మరి ఆ లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. 

పవన్ అండ్ రవితేజ ఒకే స్టేజ్ పై ఉండి  ఫ్యాన్స్ కి  ఐ ఫీస్ట్ కలగచేయబోతున్నారని, ఇందుకు  మిస్టర్ బచ్చన్ వేదిక కానుందనే  వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ వన్ మాన్ షో గా, హరీష్ శంకర్(harish shankar)దర్శకత్వంలో విశ్వ ప్రసాద్ నిర్మాతగా వస్తున్న  మిస్టర్ బచ్చన్(mr bachchan)అగస్ట్ 15 న విడుదల కానుంది.దీంతో చిత్ర యూనిట్ అతి త్వరలోనే  ప్రీరిలీజ్ ఈవెంట్  జరగనుంది. ఇప్పుడు ఈ ఈవెంట్ కి  పవన్ ని  చీఫ్ గెస్ట్ గా  ఇన్వైట్ చెయ్యాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అధికారకంగా మాత్రం  ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఇది  నిజమయ్యే అవకాశం లేకపోలేదు.ఎందుకంటే బచ్చన్  ఫ్యామిలీ  పవన్ కి చాలా కావాల్సిన వాళ్ళు. రవితేజ, పవన్ కి మధ్య ఉన్న అనుబంధం అందరకి తెలిసిందే. గతంలో రవితేజ నేలటికెట్ మూవీ ప్రీ రిలీజ్ కి వెళ్ళినపుడు ఇద్దరు షేర్ కూడా  చేసుకున్నారు.

 

ఇక దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కి ఎంత పెద్ద ఫ్యానో చెప్పక్కర్లేదు. పైగా గబ్బర్ సింగ్ తర్వాత ఆ ఇద్దరి కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రాబోతుంది. అదే విధంగా నిర్మాత విశ్వ ప్రసాద్, పవన్ కి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆ ఇద్దరి కాంబోలో బ్రో మూవీ కూడా వచ్చింది. సో పవన్ వచ్చే అవకాశాలు  లేకపోలేదు. ప్రస్థుతానికి అయితే రాజకీయాల్లో బిజీ. 
ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో వస్తుండంతో  పవన్, రవి తేజ ని మరో సారి ఒకే వేదికపై చూడాలని ఇద్దరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పైగా పవన్ ఇప్పుడు మంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో  రవితేజ గురించి పవన్  ఏం మాట్లాడతాడు. అదే విధంగా రవితేజ ఏం మాట్లాడతాడు అనే ఆసక్తి అందరిలో ఉంది.