English | Telugu

పవన్, చిరుల మధ్య కోల్డ్ వార్...?

 

మెగా బ్రదర్ తనయుడు వరుణ్ తేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్ర ముహూర్త కార్యక్రమం నేడు ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, చిరంజీవిలు మాట్లాడుకొనే లేదు. పూజా కార్యక్రమం దగ్గర చిరంజీవి ఉంటే క్రింద కెమెరాల దగ్గర పవన్ నిలబడిపోయాడు. పవన్ వచ్చినా కూడా కనీసం ఎలాంటి పలకరింపులు కూడా చేయలేదు చిరు. పూజా కార్యక్రమం పూర్తి అవ్వగానే వెంటనే.. చిరు చూస్తుండగానే పవన్ వెళ్ళిపోయాడు. కానీ చిరంజీవి మాట్లాడేటప్పుడు పవన్ వెళ్ళే సంగతి తెలియనట్లుగా "పవన్ ఎక్కడ?" అంటూ రివర్స్ లో అడగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిబట్టి చూస్తే చిరు, పవన్ ల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.