English | Telugu
పవన్ కు "బాద్ షా" భయం పట్టుకుందా?
Updated : Jul 8, 2013
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "అత్తారింటికి దారేది". ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అయితే ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం పై ప్రస్తుతం అభిమానుల్లో కొంత ఉత్కంట నెలకొంది.
ఇటీవలే ఎన్.టి.ఆర్. నటించిన "బాద్ షా" చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో ఒక అభిమాని మరణించిన సంగతి అందరికి తెలిసిందే. దాంతో మళ్ళీ ఇలాంటి అపశ్రుతులు జరగకూడదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు. అందుకే తన కొత్త చిత్రం యొక్క విడుదల కార్యక్రమం ఆపేసి, నేరుగా మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తున్నాడట. కాని ఈ చిత్ర దర్శక, నిర్మాతలు మాత్రం ఎలాగైనా ఆడియో ఫంక్షన్ చేద్దామని పవన్ ను బలవంతం చేస్తున్నారట.
నిజానికి అభిమానులకు కూడా ఈ ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహిస్తేనే సంతోషం. మరి దీనికి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తొందర్లోనే తెలియనుంది.