English | Telugu
'భోళా శంకర్' భామలతో భలే స్కెచ్!
Updated : Aug 4, 2023
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'భోళా శంకర్' ఈ నెల 11న విడుదలకు సిద్ధమైంది. పదేళ్ళ తరువాత మెహర్ రమేశ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో చిరంజీవికి జంటగా తమన్నా నటించగా, చిరుకి చెల్లెలు పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. అటు తమన్నా, ఇటు కీర్తి.. ఇద్దరు కూడా మెహర్ రమేశ్ దర్శకత్వంలో నటించిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం.
ఇదిలా ఉంటే, 'భోళా శంకర్' తరువాత మెహర్ రమేశ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తన గత చిత్రాలకు భిన్నంగా ఈసారి స్టార్ హీరోలతో కాకుండా స్టార్ హీరోయిన్ల కాంబోలో ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారట. తమన్నా, కీర్తి సురేశ్ కాంబినేషన్ లో ఫిమేల్ సెంట్రిక్ మల్టిస్టారర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కనుందట. 'భోళా శంకర్' షూటింగ్ టైమ్ లోనే ఈ ప్రాజెక్ట్ ని లాక్ చేశాడట మెహర్. ఇప్పటికే తమన్నా, కీర్తి సురేశ్ పలు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు టాప్ హీరోయిన్స్ కాంబోలో మల్టిస్టారర్ అంటే అది ఆసక్తి రేకెత్తించే విషయమే. మరి.. 'భోళా శంకర్' భామలతో మెహర్ చేయనున్న ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. త్వరలోనే ఈ మల్టిస్టారర్ పై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.