English | Telugu
ఆ హీరోయిన్ డ్రైవింగ్ చేస్తూ నిద్రపోయిందట
Updated : Feb 4, 2015
సినీ నటి జీవిత కారు డ్రైవింగ్ చేస్తూ నిద్రపోయారు. తన కుమార్తెలతో కలసి కారులో వెళ్తుండగా ఒక చోట రెడ్ సిగ్నల్ పడింది. ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత కారు ఎంతసేపటికీ కదలకపోవడంతో జీవిత కుమార్తెలు తమ తల్లి వైపు చూసి అదిరిపోయారు. ఎందుకంటే, అక్కడ జీవిత స్టీరింగ్ మీద తల పెట్టుకుని హాయిగా నిద్రపోతున్నారు. దాంతో జీవిత కుమార్తెలిద్దరూ ఆమెను నిద్రలేపి కారును ముందుకు డ్రైవ్ చేయించారు. ఆ తర్వాత జీవిత అలెర్ట్‌గా కారు నడిపి క్షేమంగా గమ్యాన్ని చేర్చి, ఆ తర్వాత నిద్రపోయారు. ఈ విషయాన్ని జీవిత భర్త, కథానాయకుడు డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఆయన నటించిన ‘గడ్డం గ్యాంగ్’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఓ ఛానల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ‘గడ్డం గ్యాంగ్’ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో తమ కుటుంబం మొత్తం ఇన్వాల్వ్ అయి పనిచేస్తోందని, జీవిత అయితే నిద్ర మానేసి మరీ పని చేస్తోందని, అందుకనే డ్రైవింగ్ చేస్తూ సిగ్నల్ దగ్గర నిద్రపోయిందని రాజశేఖర్ తెలిపారు. అయితే ఆ ఘటన తర్వాత ఆమెను కొంతకాలం పాటు కారు డ్రైవ్ చేయొద్దని తాము కోరామని ఆయన చెప్పారు. నటి జీవిత ఇటీవల కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా నియమితురాలైన విషయం తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ జీవిత కొంతకాలం డ్రైవింగ్ జోలికి వెళ్ళకపోతే మంచిది.