English | Telugu

ఎన్టీఆర్ పెడుతున్న కండీష‌న్లు

టాలీవుడ్‌లో ఎన్టీఆర్ మ‌ళ్లీ త‌న స్టామినా నిరూపించుకొనే ప‌నిలో ఉన్నాడు. అర్జెంటుగా ఓ హిట్టుకొట్టి... త‌న స‌త్తా త‌గ్గ‌లేద‌ని చాటి చెప్పాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. పూరి జ‌గ‌న్నాథ్ సినిమా టెంప‌ర్ ఏసీ డీసీ ఆట‌ని త‌న‌కు తెలుసు. పూరి జ‌గ‌న్నాథ్ ఎప్పుడు ఎలాంటి సినిమా తీస్తాడో త‌న‌కే తెలీదు. అందుకే టెంప‌ర్‌తో ఎలాంటి ఫ‌లితం వ‌చ్చినా సుకుమార్ సినిమా విష‌యంలో మాత్రం జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే అనుకొంటున్నాడ‌ట‌. ఈ సినిమా బ‌డ్జెట్‌, క‌థానాయిక‌, మిగిలిన సాంకేతిక నిపుణులు అన్నీ ఎన్టీఆర్ సూచ‌న‌ల మేర‌కే నిర్ణ‌యించ‌బోతున్నాడు. క‌థ విష‌యంలో ఏమాత్రం రాజీ ప‌డ‌న‌ని సుక్కుకి ముందే చెప్పాడ‌ట‌. అందుకే బౌండెడ్ స్ర్కిప్ట్ చూసుకొనే ఈ క‌థ ఓకే చేశాడు తార‌క్‌. ఇప్పుడు హీరోయిన్ విష‌యాన్నీ తానే ఫైన‌ల్ చేస్తాన‌న్నాడ‌ట‌. స్టార్ డ‌మ్ ఉన్న క‌థానాయికే కావాల‌ని ప‌ట్టుప‌డుతున్నాడ‌ట‌. త‌మ‌న్నా అయితే త‌న‌కు అన్నివిధాలా సూట్ అవుతుంద‌ని.. ఆమెనే తీసుకోవాల‌ని కండీష‌న్ పెట్టాడ‌ట‌. అంతేకాదు.. దేవిశ్రీ ప్ర‌సాద్ ని తీసుకోవాల్సిందే అని ప‌ట్టుప‌డుతున్నాడ‌ట‌. కెమెరామెన్‌, ఎడిట‌ర్‌.. ఇలా ఏయే శాఖ‌లో ఎవ‌రెవ‌ర్ని తీసుకోవాలో ఓ లిస్టు రాసిపెట్టుకొన్నాడ‌ట‌. ఇవ‌న్నీ తాను నిర్దేశించిన బ‌డ్జెట్‌లోనే జ‌ర‌గాల‌ని, బ‌డ్జెట్‌ని ఇష్టం వ‌చ్చిన‌ట్టు పెంచేసి, చివ‌ర్లో త‌న‌ని బాధ్యుడిని చేయొద్ద‌ని నిర్మాత బివిఎస్ ఎన్ ప్ర‌సాద్‌కి చెప్పాడ‌ట‌. త‌మ‌న్నా, దేవిశ్రీ...ఇలా ఎన్టీఆర్ చెప్పిన‌వాళ్లందరినీ తీసుకొంటూ పోతే అనుకొన్న బ‌డ్జెట్‌లో సినిమా ఎలా పూర్త‌వుతుంది?? అని నిర్మాత దిగులుప‌డిపోతున్నాడ‌ట‌. అదీ క‌రెక్టే. మొత్తానికి ఎన్టీఆర్ ఫామ్‌లోకి రావ‌డానికి త‌న వంతు కృషి చేస్తున్నాడన్న‌మాట‌. మంచిదే క‌దా..?!