English | Telugu
నిత్యా కోరికకు ఇద్దరు బలి?
Updated : Jul 19, 2013
హీరోయిన్ అంటే అందరికి మాట్లాడాలి, కనీసం ఒక్కసారైనా దగ్గరగా చూడాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ అలాంటి హీరోయిన్ మన దగ్గరికే వస్తే ఎలా ఉంటుంది? అందరికి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది కానీ, ఇద్దరికీ మాత్రం శాపంలా మారింది. మరి ఇంతకి ఆ హీరోయిన్ ఎవరో కాదు.. మన బొద్దు గుమ్మ నిత్యమీనన్.
ఈ అమ్మడు బెంగుళూరు నుంచి హైదరాబాద్ కి వచ్చే ఫ్లైట్ లో సాధారణ ప్రయాణికురాలుగా ఉండక, కాక్ పిట్ లోపలి వెళ్లి విమానం గురించి తెలుసుకోవలనుకొని.. వెళ్లి పైలెట్ లను అడిగిందట. దానికే హీరోయిన్ వచ్చి అడగడంతో వెంటనే ఒప్పేసుకుని ఈ అమ్మడిని ఆహ్వానించేసారట. అయితే ఎంతటి వారికైనా కూడా కాక్ పిట్ లోకి వెళ్ళే అనుమతి ఉండదు. అలాంటిది ఒక హీరోయిన్ వెళ్లి తమ రూల్స్ ని అతిక్రమించిందని అక్కడే ఉన్న ఓ సీనియర్ అధికారి పై అధికారులకు కంప్లైంట్ చేసాడు. దీంతో ఆ ఇద్దరు పైలెట్ల ఉద్యోగాలు పికేసారట.
పాపం ఈ అమ్మడి కోరిక ఇద్దరి భవిష్యత్తుకు శాపంగా మారిపోయిందన్నమాట.