English | Telugu
పవన్ కు అతను భయపడుతున్నాడా...?
Updated : Jul 20, 2013
రాంచరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "ఎవడు". దిల్ నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 31న విడుదల చేయనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "అత్తారింటికి దారేది" చిత్రం ఆగస్టు 7న విడుదల కానుందనే విషయం తెలిసి కూడా "ఎవడు" చిత్రాన్ని విడుదల చేయడానికి దిల్ రాజు ఎందుకు ధైర్యం చేస్తున్నాడని టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనికి రాంచరణ్ కూడా ఎలాంటి అడ్డు చెప్పకపోవడంతో మెగా ఫ్యామిలీ లో కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అదే విధంగా "ఎవడు" ఆడియో వేడుకను పవన్ హైదరాబాద్ కు వచ్చేంత వరకు ఆపకుండా.. పవన్ వచ్చే ముందు రోజే ఆడియో విడుదల చేసేసారు. దీనివల్ల పవన్ తో "ఎవడు" టీం వార్ కు సిద్దం అయినట్లు తెలుస్తుంది. కానీ తాజా సమాచారం ప్రకారం దిల్ రాజు కాస్త భయపడుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది.
ఎందుకంటే... "అత్తారింటికి దారేది" చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ కు దిల్ రాజుకు రోజు రోజుకి టెన్షన్ పెరిగిపోతుందట. ఈ సినిమా ఫొటోస్, ట్రైలర్స్ విడుదలయ్యాక వాటికి వస్తున్న రెస్పాన్స్ ఇప్పటికే టాలీవుడ్ రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేసేసింది. నిన్న విడుదలైన సాంగ్స్ కూడా అదిరిపోవడంతో ఇక దిల్ రాజు బెదిరిపోతున్నాడని టాక్. మరి దిల్ రాజుకు "ఎవడు" చిత్రం ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.