English | Telugu
అక్కినేని నాగచైతన్య వృషకర్మ నా!
Updated : Jan 20, 2025
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య(Naga chaitanya)ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ 'తండేల్'(Thandel)కి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు.ఫిబ్రవరి 7 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్నఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్.శ్రీకాకుళంకి చెందిన ఒక మత్స్యకారుడి నిజ జీవితం లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కగా, గీతా ఆర్ట్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ లో కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి(Chandu mondeti)'తండేల్' కి దర్శకుడు కావడంతో మూవీపై,అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.ఇక ఈ మూవీ తర్వాత చైతు 'విరూపాక్ష'ఫేమ్ కార్తీక్ దండు(Karthik Dandu)దర్శకత్వంలో మూవీ చెయ్యబోతున్న విషయం తెలిసిందే.
మైథికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి 'వృషకర్మ'(Vrusha Karma)అనే టైటిల్ ని ఫిక్స్ చెయ్యాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్టుగా సినీ సర్కిల్స్ లో కథనాలు వినిపిస్తున్నాయి.'వృషకర్మ' అనే పేరు ఖచ్చితంగా చాలా విభిన్నమైనదే.కానీ మాస్ ప్రేక్షకులకి ఎంత మేర రీచ్ అవుతుందనే ఆలోచనలో కూడా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.విరూపాక్ష అనే టైటిల్ పెట్టినపుడు కూడా చాలా మందికి రీచ్ అవ్వడానికి కొంత టైం పట్టింది.కానీ ఆ సినిమా ఘన విజయానికి టైటిల్ కూడా ఒక కారణమయిందనటంలో ఎలాంటి సందేహం లేదు.'వృషకర్మ' అంటే కార్యసాధకుడు, చేసే పనిపై శ్రద్ద ఉన్నవాడు అని అర్థం.
ఇక ఈ మూవీని అత్తారింటికి దారేది ఫేమ్ బివీఎస్ఎన్ ప్రసాద్, దర్శకుడు సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.చైతు కెరీర్లోనే హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సిజి వర్క్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఉండబోతుంది.శ్యాందత్, అంజనీష్ లోక్ నాద్,నవీన్ నూలి వంటి టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.హీరోయిన్ తో పాటు మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.చైతు నుండి వస్తున్న24 చిత్రం కాగా అనౌన్సుమెంట్ పోస్టర్ అయితే అభిమానుల్లో,ప్రేక్షకుల్లో మూవీ మీద ఇప్పటి నుంచే క్యూరియాసిటీ ని పెంచిందని చెప్పవచ్చు.