English | Telugu
ఆర్ సి 16 పుష్ప 2 డేట్ కే రిలీజ్?
Updated : Jan 21, 2025
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)సంక్రాంతి కానుకగా,జనవరి 10 న 'గేమ్ చేంజర్'(Game Changer)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా,డ్యూయల్ రోల్ లో చరణ్ ప్రదర్శించిన నటనకి మంచి పేరు వచ్చిందని చెప్పవచ్చు.ఇక ఈ మూవీ తర్వాత చరణ్ 'ఉప్పెన'మూవీ ఫేమ్ బుచ్చిబాబు(Buchi babu)తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.చిత్ర బృందం అధికారకంగా ప్రకటించపోయినా, పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో మూవీపై మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ హైప్ నెలకొని ఉంది.
గత ఏడాది పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం ఇప్పటికే మైసూర్ లో షూటింగ్ ని జరుపుకుంది.ఆ తర్వాత షూటింగ్ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు.పైగాచరణ్ గేమ్ చేంజెర్ ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి వచ్చింది.ఇక ఇప్పుడు ఆ హడావిడి లేకపోవడంతో చరణ్ ఆర్ సి 16 షూట్ లో పాల్గొనబోతున్నాడని అంటున్నారు.అందులో భాగంగా కొత్త షెడ్యూల్ జనవరి 27 న ప్రారంభం కానున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.ఈ షెడ్యూల్ నుంచి ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా పక్కా ప్రణాళికతో వీలైనంత త్వరగా,షూటింగ్ ని కంప్లీట్ చెయ్యాలని కూడా మేకర్స్ భావిస్తునట్టుగా తెలుస్తుంది.దాదాపు జూలై నెల నాటికి మొత్తం షూట్ ని పూర్తి చేసి,దసరా లేదా డిసెంబర్ నెలలో రిలీజ్ కి ప్లాన్ చెయ్యాలని చూస్తున్నారనే రూమర్స్ కూడా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.
ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్(Ar rehman)సంగీతాన్ని అందిస్తున్నాడు.వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)రీసెంట్ గా పుష్ప 2(Pushpa 2)తో పాన్ ఇండియా లెవల్లో తన సత్తా చాటిన విషయం తెలిసిందే.ఆ మూవీ డిసెంబర్ 5 న విడుదల అయ్యింది.దీంతో సెంటిమెంట్ గా చరణ్ సినిమాని కూడా అదే డేట్ కి రిలీజ్ చేస్తారేమో అనే టాక్ కూడా సినీ సర్కిల్స్ లో వినపడుతుంది. చరణ్ సరసన దేవర(Devara)ఫేమ్ జాన్వీ కపూర్(Janhvi kapoor)హీరోయిన్ గా చేస్తుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్(Sivarajkumar)జగపతిబాబు(Jagapathibabu)కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.