English | Telugu

శ్రీకాంత్ ఓదెల, సుజీత్ సినిమాలను పక్కన పెట్టిన నాని!

శ్రీకాంత్ ఓదెల, సుజీత్ సినిమాలను పక్కన పెట్టిన నాని!

 

నేచురల్ స్టార్ నాని మే 1న 'హిట్-3'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'పారడైజ్'తో పాటు, సుజీత్ డైరెక్షన్ లో ఒక సినిమా కమిటై ఉన్నాడు.  అయితే ఏవో కారణాల ఆ రెండు సినిమాలు ఆలస్యమవుతున్నాయి. దీంతో ఇప్పుడు ఆ రెండు సినిమాల కంటే ముందు, నాని మరో ప్రాజెక్ట్ ని పూర్తి చేయనున్నాడని తెలుస్తోంది. (Natural Star Nani)

 

తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన 'డాన్' సినిమా దర్శకుడు సిబి చక్రవర్తితో నాని ఓ సినిమా చేయనున్నాడని 2023 లో వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత ఆ సినిమాకి సంబంధించిన న్యూస్ లేదు. అయితే ఇంత కాలానికి.. ఆ ప్రాజెక్ట్ కి మోక్షం కలగబోతున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీని, త్వరలోనే అనౌన్స్ చేయనున్నారట. మే నుంచి షూటింగ్ మొదలుపెట్టి.. ఈ ఏడాది డిసెంబర్ లో లేదా 2026 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.