English | Telugu

బాలీవుడ్‌ స్టార్‌ హీరోతో ‘అన్‌స్టాపబుల్‌’ షో చేయనున్న నందమూరి బాలకృష్ణ!

ఓటీటీలో నిర్వహిస్తున్న రియాలిటీ షోలలో నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘అన్‌స్టాపబుల్‌’ టాక్‌ షోకి చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పటివరకు టాలీవుడ్‌ హీరోలతో షో నిర్వహించిన బాలకృష్ణ ఇప్పుడు బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణబీర్‌ కపూర్‌తో ఈ షో చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ షోలో రణబీర్‌ కపూర్‌తోపాటు డైరెక్టర్‌ సందీప్‌ వంగా కూడా పాల్గొంటాడని తెలుస్తోంది. ‘అర్జున్‌ రెడ్డి’తో టాలీవుడ్‌లో, ‘కబీర్‌సింగ్‌’తో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సందీప్‌ వంగా... ప్రస్తుతం రణబీర్‌ కపూర్‌, రష్మిక మందన్న జంటగా ‘యానియల్‌’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. డిసెంబర్‌ 1న ఈ సినిమా దేశంలోని పలు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ‘ఆహా’లో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బికె’లో ‘యానిమల్‌’ టీమ్‌ సందడి చేయబోతోందని సమాచారం. 

ఈ టాక్‌ షోను గత రెండు సీజన్లుగా ఎంతో నందమూరి బాలకృష్ణ ఎంతో చాకచక్యంగా నిర్వహిస్తున్నారు. మంచి టైమింగ్‌తో పంచ్‌లు వేయడమే కాకుండా, ముక్కుసూటిగా అడిగే ప్రశ్నలు, సెటైర్లు.. ఆడియన్స్‌ని బాగా ఎంటర్‌టైన్‌ చేస్తున్నాయి. ఈమధ్యే మూడో సీజన్‌ ప్రారంభం కాగా.. ఈ ఎపిసోడ్‌లో ‘భగవంత్‌ కేసరి’ టీమ్‌ ఎంతో హుషారుగా పార్టిసిపేట్‌ చేసింది. తాజా సమాచారం మేరకు ‘యానిమల్‌’ టీమ్‌ కూడా ఈ షోలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.