English | Telugu

జైలర్-2 లో బాలయ్య.. ఫ్యాన్స్ కి పూనకాలే..!

 

రజినీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'జైలర్' సినిమా 2023 ఆగస్టులో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో రజినీని నెల్సన్ చూపించిన తీరుకి అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అలాగే అతిథి పాత్రల్లో మెరిసిన శివరాజ్‌కుమార్‌, మోహన్ లాల్ పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి. నిజానికి 'జైలర్'లో ఓ స్పెషల్ రోల్ కోసం బాలకృష్ణను సంప్రదించాడు నెల్సన్. కానీ ఏవో కారణాల బాలకృష్ణ ఆ సినిమాలో నటించలేదు. దీంతో స్క్రీన్ మీద రజినీ, బాలయ్యను కలిపి చూసే ఛాన్స్ మిస్ అయినందుకు ఫ్యాన్స్ ఎంతో డిజప్పాయింట్ అయ్యారు. అయితే ఇప్పుడు 'జైలర్-2' రూపంలో ఆ డిజప్పాయింట్ మెంట్ పోయే అవకాశముంది. (Balakrishna in Jailer 2)

 

రజినీకాంత్, నెల్సన్ కాంబినేషన్ లో 'జైలర్-2' రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సీక్వెల్ హైప్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన అనౌన్స్ మెంట్ వీడియోకి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అంచనాలను రెట్టింపు చేసే న్యూస్ వినిపిస్తోంది. 'జైలర్-2' కోసం బాలకృష్ణను రంగంలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయట. 'జైలర్-2'లో అదిరిపోయే క్యామియో రోల్ ఉందని, ఆ రోల్ బాలయ్య చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో నెల్సన్ ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ సైతం 'జైలర్-2'లో క్యామియో చేయడానికి సుముఖుత వ్యక్తం చేసినట్లు సమాచారం. అదే జరిగితే, 'జైలర్-2'పై అంచనాలు ఆకాశాన్నంటుతాయి అనడంలో సందేహం లేదు. రజినీ, బాలయ్య కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే అభిమానులు పూనకాలతో ఊగిపోతారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.