English | Telugu
ఆ సినిమాపై కన్నేసిన టాలీవుడ్ నిర్మాతలు
Updated : Jul 20, 2013
ధనుష్ హీరోగా భారత్ బాల దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం "మారియన్". ఈ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అద్భుతంగా నటించిన ధనుష్ కు, అదిరిపోయే సంగీతంతో పాటు ది బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన ఎ.ఆర్. రెహమాన్ కు ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. అయితే తమిళంలో ఇంత పెద్ద హిట్టు చిత్రంగా దూసుకెళ్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఒకరు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తారో లేక.. ధనుష్ మార్కెట్ టాలీవుడ్ లో కూడా పెంచడానికి డబ్బింగ్ చేసి విడుదల చేస్తారో అనే విషయం త్వరలోనే తెలియనుంది.