English | Telugu
ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా మంచు మనోజ్.. ప్రశాంత్ నీల్ స్కెచ్ అదిరింది!
Updated : Aug 12, 2024
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), మంచు మనోజ్ (Manchu Manoj) మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తన ప్రాణ స్నేహితుడని మనోజ్ చెబుతుంటాడు. చెప్పడమే కాదు.. కష్ట సమయాల్లో ఎన్టీఆర్ కి అండగా నిలబడతాడు కూడా. అలాంటి మంచి స్నేహితులైన ఎన్టీఆర్, మనోజ్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. అది కూడా ఒకరినొకరు ఢీ కొట్టే పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. (NTR Neel)
ప్రస్తుతం 'దేవర', 'వార్ 2' సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ లాంచ్ అయింది. త్వరలో సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్ ఫుల్ పాత్రలో మనోజ్ నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆ వార్త నిజమైతే ఇది క్రేజీ కాంబో అవుతుంది అనడంలో సందేహం లేదు.
నటనకు కొన్నేళ్లు బ్రేక్ ఇచ్చిన మనోజ్.. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న 'మిరాయ్'తో విలన్ గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన మనోజ్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ఆయనకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. అందుకే మనోజ్ విలన్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడనే న్యూస్ రాగానే.. పలువురు ఫిల్మ్ మేకర్స్ దృష్టి ఆయనపై పడింది. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ సైతం ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కోసం మనోజ్ ని రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నాడట. అదే జరిగితే.. పాన్ ఇండియా సినిమాలకు విలన్ గా మనోజ్ బెస్ట్ ఛాయిస్ అయ్యే ఛాన్స్ ఉంది.