English | Telugu
మహేష్, పూరీల బిజినెస్ మేన్ 2012 సంక్రాంతికి
Updated : Jul 28, 2011
మహేష్, పూరీల "బిజినెస్ మేన్" 2012 సంక్రాంతికి విడుదల కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న విభిన్నకథా చిత్రం "ది బిజినెస్ మేన్". మహేష్, పూరీల "బిజినెస్ మేన్" చిత్రానికి "గన్స్ డోంట్ నీడ్ ఎగ్రిమెంట్" అన్న క్యాప్షన్ ని నిర్ణయించారు. ముంబయ్ నేపథ్యంగా సాగే మాఫియా నేపథ్యంలో జరిగే కథతో ఈ మహేష్, పూరీల "బిజినెస్ మేన్" నిర్మించబడుతూందట.
మహేష్, పూరీల "బిజినెస్ మేన్" సినిమా ప్రారంభం కాదనీ, హీరో మహేష్ బాబుకీ, దర్శకుడు పూరీ జగన్నాథ్ కీ మధ్య ఏవో గొడవలొచ్చాయనీ ఈ మధ్య ఫిలింనగర్ లో ఒక రూమర్ వినపడింది. మహేష్, పూరీల "బిజినెస్ మేన్" స్క్రిప్ట్ కూడా పూర్తయింది కనుక రానున్న సెప్టెంబర్ నెలలో షూటింగ్ ప్రారంభించుకుని, వచ్చే 2012 జనవరి నెలలో సంక్రాంతి పండుగకు విడుదల చేయనున్నరట. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో గ్తమ్లో వచ్చిన "పోకిరి" రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. మహేష్, పూరీల "బిజినెస్ మేన్" సినిమా దాన్ని మించిన రేంజ్ లో ఉంటుందని మహేష్ అభిమనులు ఆశిస్తూన్నారు.