English | Telugu

కార్పెంటర్ పై నమ్రత కేస్

కార్పెంటర్ పై నమ్రత కేస్ వేసిందట. వివరాల్లోకి వెళితే ప్రిన్స్ మహేష్ బాబు వంటి ప్రముఖ హీరో భార్య అయి వుండీ ఒక వండ్రంగి అదేనండీ కాంర్పెంటర్ పై చీప్ గా పోలీస్ కేసు పెట్టటమేంటని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే ఈ మధ్య ప్రముఖ హీరో మహేష్ బాబు ఫిలిం నగర్ లో ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ డెకరేషన్ పనిని ఒక కార్పెంటర్ కి అప్పగించారట.

ఆ కార్పెంటర్ తనకు రావలిసిన మొత్తం డబ్బులు ముందుగానే తీసుకుని, పని సగంలో ఉండగానే జేండా ఎత్తేశాడట. దాంతో నన్నే మోసం చేస్తావా...? అని కోపంతో ఆ కార్పెంటర్ మీద మహేష్ బాబు భార్య నమ్రత పోలీస్ కేస్ పెట్టిందట. మరి అంగీకరించిన పని పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసి, మొత్తం రావలిసిన డబ్బులు తీసుకుని చెప్పాపెట్టకుండా పరారైతే ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది. అలా మండితేనే ఇలా పోలీస్ కేసులూ గట్రా వచ్చి పడేది.