English | Telugu
రెడీలో ఆశిన్ తో సల్మాన్ లిప్ లాక్
Updated : Jun 3, 2011
ఆశిన్ తో సల్మాన్ లిప్ లాక్ సీన్లో తన్మయత్వంతో నటించాడట. వివరాల్లోకి వెళితే తెలుగులో చురుకైన యువ హీరో రామ్ హీరోగా, జెనీలియా డిసౌజా హీరోయిన్ గా, శ్రీను వైట్ల దర్శకత్వంలో నిర్మించిన సూపర్ హిట్ సినిమా "రెడీ". ఈ "రెడీ" సినిమాని బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ హీరోగా, ఆశిన్ హీరోయిన్ గా "రెడీ" పేరుతోనే అనీస్ బజ్మీ దర్శకత్వంలో, భూషణ్ కుమార్, కృషన్ కుమార్ పునర్నిర్మిస్తున్నారు.
ఈ బాలీవుడ్ "రెడీ" సినిమాలో హీరో సల్మాన్ ఖాన్, హీరోయిన్ ఆశిన్ ల మధ్య ఒక ఘాటైన లిప్ లాక్ సీన్ ఉందట. ఆ లిప్ లాక్ సీన్లో సల్మాన్ ఖాన్ తన్మయత్వంతో వొళ్ళు మరచిపోయి మరీ నటించాడట. సారీ జీవించాడట. ఈ లిప్ లాక్ సీన్ మీద హీరోయిన్ ఆశిన్ స్పందిస్తూ "ఆ లిప్ లాక్ సీన్లో అసభ్యతేమీ మీకు కనపడదు. నిజానికి ఆ సీన్ చాలా గ్రేస్ ఫుల్ గా వచ్చింది. దర్శకులు అంత చక్కగా చిత్రీకరించారు" అంటూంది.