English | Telugu
మణిరత్నం సినిమాకి రెహమాన్ వాయించట్లేదు
Updated : May 15, 2011
మణిరత్నం సినిమాకి రెహమాన్ వాయించట్లేదు అని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే మహేష్ బాబు, విజయ్, ఆర్య హీరోలుగా, మణి రత్నం దర్శకత్వంలో, 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించ తలపెట్టిన భారీ చిత్రం తీయవద్దని ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఎ.ఆర్.రెహమాన్ సలహా ఇచ్చాడట. చోళ, పల్లవ రాజుల కాలానికి చెందిన వివరాలతో రూపొందించిన ప్రసిద్ధి చెందిన తమిళ చారిత్రాత్మక నవల "పొన్నియన్ సెల్వన్ " ఆధారంగా మణిరత్నం ఒక భారీ చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు.
కానీ మణిరత్నం తీసిన "రావణ్"(విలన్) బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవటంతో, ఈ మూవీకి ఫైనాన్స్ చేయటానికి ఫైనాన్సియర్లెవరూ ముందుకు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న రెహమాన్ ఈ సినిమాని ఆపేయమనీ, చక్కగా ఏ "సఖి" వంటి రొమాంటిక్ సినిమానో తీయమనీ, అటువంటి సినిమాకైతే తన వద్ద మూడు అద్భుతమైన ట్యూన్లు కూడా సిద్ధంగా ఉన్నాయనీ మణిరత్నంతో అన్నారట. అదీ సంగతి.