English | Telugu

అనుష్క తర్వాత స్థానం ఆమెదేనా...?

 

గతంలో అనుష్క చేసినవన్నీ కూడా గ్లామర్ పాత్రలే అయినప్పటికీ సరైన గుర్తింపు మాత్రం "అరుంధతి" చిత్రంతోనే దక్కింది. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన "అరుంధతి" చిత్రం ద్వారా అనుష్క టాప్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఇదే మార్గంలో తను కూడా టాప్ హీరోయిన్ గా స్థానం సంపాదించుకోవచ్చుననే ఆలోచనలో ఉందట హీరోయిన్ లక్ష్మీరాయ్.

 

ప్రస్తుతం లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "రాణి రాణమ్మ". ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపైనే లక్ష్మీరాయ్ తన ఆశలన్నీ పెట్టుకుంది. ఈ చిత్రం విజయం సాధిస్తే తను కూడా టాప్ హీరోయిన్ స్థానాన్ని సొంతం చేసుకోవచ్చని ఆశపడుతుందట. ఇటీవలే "లక్కీ లక్కీ రాయ్..." అంటూ ఐటెం సాంగ్ లో నటించిన "బలుపు" చిత్రం ఘన విజయం సాధించడంతో... లక్ష్మీరాయ్ ఫుల్ జోష్ లో ఉందట. "రాణి రాణమ్మ" చిత్రం కూడా అదే రెంజులో విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉందట.