English | Telugu

నితిన్ కు అంత సీన్ లేనట్లేనా...?

 

"ఇష్క్", "గుండె జారి గల్లంతయ్యిందే" చిత్రాల తరువాత నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రాలు "కొరియర్ బాయ్ కళ్యాణ్", "హార్ట్ ఎటాక్". "కొరియర్ బాయ్ కళ్యాణ్" చిత్రంలో నితిన్ సరసన యామి గౌతమి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది. ఈ చిత్ర మిగత కార్యక్రమాలు పూర్తి చేసుకొని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా నితిన్ నటిస్తున్న మరో చిత్రం "హార్ట్ ఎటాక్". పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆదా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇటీవలే ఈ చిత్రంలో నిత్యామీనన్ కూడా తీసుకున్నట్లు తెలిసింది.

తన గత రెండు చిత్రాలు కూడా నిత్యా ఉండడం వల్లే విజయం సాధించాయని భావిస్తున్న నితిన్... "హార్ట్ ఎటాక్" చిత్రంలో దర్శకుడు పూరిని ఒప్పించి మరీ నిత్యాను సినిమాలో తీసుకున్నాడట. ఒకవేళ ఇదే నిజమై ఈ సినిమా హిట్టయితే ఆ క్రెడిట్ అంతా కూడా నిత్యాకే వెళ్ళిపోతుంది. ఒకవేళ నితిన్ నమ్మకమే కరెక్ట్ అయితే మరి తన మరో చిత్రం "కొరియర్ బాయ్ కళ్యాణ్" ఫ్లాప్ అవుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఈ రెండు చిత్రాలు విడుదలయ్యేవరకు వేచి చూడాల్సిందే.