English | Telugu
గోపీచంద్,కృష్ణ వంశీ "మొగుడు"
Updated : Jan 28, 2011
భవ్యక్రియేషన్స్ పతాకంపై, గోపీచంద్ హీరోగా, దీక్షా సేథ్ హీరోయిన్ గా, ప్రకాష్ రాజ్ విలన్ గా నటించగా, మచ్చా రవిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఆనంద ప్రసాద్ నిర్మించిన "వాంటెడ్" చిత్రం ఇటీవల విడుదలై ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం తర్వాత గోపీచంద్ ఏ చిత్రంలో నటిస్తారా అని అంతా అనుకుంటూండగా ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో ఆయన నటిస్తారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ కి కచ్చితమైన హిట్ అవసరం.అదే స్థితిలో కృష్ణ వంశీ కూడా ఉన్నారు.అదీ గాక కృష్ణ వంశీ తన చిత్రాల్లో హీరోని ప్రెజెంట్ చేసే విధానమే వేరుగా ఉంటుంది.ఈ చిత్రానికి "మొగుడు" అన్న పేరుని కూడా నిర్ణయించారనీ సమాచారం.అయితే ఈ చిత్రంలో హీరో గోపీచంద్ ఎవరికి మొగుడన్నది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.